09 September 2008

లేత పచ్చ ఆకులు రేయి నల్ల వక్కలు

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

నీటిలోని కలువకి నింగిలోని జాబిలికి ఏనాడో జరిగింది కవితా కళ్యాణం
కడలిలోని ఉప్పుకి అడవిలోని ఉసిరికి ఏనాడో జరిగింది రసనా కళ్యాణం
రవికులజుడు రాముడికి భూమిపుత్రి సీతకి జరిగింది కళ్యాణం
లోక కళ్యాణం అదే దాంపత్యం ఇదీ తాంబూలం

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

పలుకుతల్లి చిలకకి పడుచు గోరింకకి జరుగుతోంది అనాదిగా మాట వరస కళ్యాణం
రేయి పగలు రెంటినీ ఆలుమగలుగా చేసి జరుగుతోంది ప్రతిరోజు సంధ్యా కళ్యాణం
పసుపులాంటి పార్వతికి సున్నమంటి శివుడికి జరిగింది పారాణి కళ్యాణం
జరిగింది ఆ ఊ మా సంగమం
ఆ ఊ మా సంగమం
ఓం ఓం ఓం

08 September 2008

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా

అందాల నా కురులతో వింజామరలు వీచనా (2)
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు కలల భాష్యాలు
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే

అధరాల కావ్యాలకు ఆవేశమందించనా(2)
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల మధురరాగాల
చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా

లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే

ఆహ హాహాహా హోయ్ హుహు హుహుహు