||పల్లవి||
నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే....
నీ కోసం నేనే పాటై మిగిలానే....
చెలియా....చెలియా.... ఓ చెలియా....
పాడనా తీయగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోట
ఆరాధనే అమృత వర్షం అవుతున్నా...
ఆవేదనే హాలాహలమై పడుతున్నా...
నా గానమాగదులే......ఇక నా గానమాగదులే
||చరణం 1||
గుండెల్లో ప్రేమకే.......
గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో
తనువంతా పులకింతే......వయసంతా గిలిగింతే.....
ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులొ కలిగే భావం ప్రేమేలే
ప్రతి మనసులొ కలిగే భావం ప్రేమేలే
||చరణం 2||
ఆకాశం అంచులో.......
ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగేనులే......అపురూపం అయ్యేనులే......
కలనైనా నిజమైనా కనులెదుటే వున్నావే
కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక వున్నది నీవేలే
ఈ విజయం వెనుక వున్నది నీవేలే
No comments:
Post a Comment