చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
చెపుతా ఓ కధని మా ఇంటికి వస్తావా
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్న వొదినే మాకు చక్కని నేస్తాలు
ఆకలి అంటు అడిగిన రోజే గురుతే లేదమ్మా
అడగక ముందే తినిపించే అమ్మేలే వొదినమ్మ
అల్లరి చెస్తే తిట్టని వాడిని ఎమంటారమ్మా
నాన్నై చూసే అన్నయ దేవుడు మాకిచాడమ్మ
చదివింది నేనయినా అలసట మా అన్నది లే
నలతంటు పడుకుంటే వొదినకి నిద్దర రాదు
ఈ ఇల్లె మా ఇద్దరి ప్రాణం ఇంకెందుకు వేరే స్వర్గం
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్న వొదినే మాకు చక్కని నేస్తాలు
సంతొషానికి ఇంకొ పేరయి పూసిన రోజాలు
శ్రీరాముడి కల పండే వరమయి పుట్టిన లవకుశలు
ఒకనిముషం ఈ సీతని ఒదలని వానర సైన్యాలు
తమ కోసం అసలేది కోరని కోవెల దీపాలు
ప్రతి రోజు పండగల ఇల్లంతా సందడిలే
అమ్మ అని పిలిచారా ఒల్లంతా పులకింతే
మీరే గా మీరే గా ఈ తీయని స్వప్నం ఏ జన్మదొ ఈ సంబందం
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్న వొదినే మాకు చక్కని నేస్తాలు
చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
నువ్వూ మాజతగా వుంటావా మా ఇంట
మా అన్న వొదిన వుండే పువ్వుల పొదరింట
కలతే రాదమ్మ నవ్వులు పండే ఈ చూట
No comments:
Post a Comment