14 July 2010

ముంతాజ్ మహలు కట్టించాడే షాజహాను

పల్లవి

ముంతాజ్ మహలు కట్టించాడే షాజహాను
ముత్యాల మహలు కట్టిస్తానే నీకై నేను
మాట్లాడే ఫోను కనిపెట్టాడే గ్రహంబెల్లు
ముద్దాడే ఫోను కనిపెడతానే నీకై నేను
ఠాంక్యూ ఠాంక్యూ నీ మాటకు ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ ప్రేమకు ఠాంక్యూ
చరణం 1

ఈఫిల్ టవరు ఈడ్చుకువచ్చిన నీ ముంగిట్లో పెట్టేస్తాను
టవరు గివరు ఎందుకు నాకు ఫ్లవరు ఒకటిస్తే చాలునంటా
చైనా వాలు చేత్తో పట్టి నీ చుట్టూర నిలబెడతాను
వాలు గీలు ఎందుకు నాకు నీ కౌగిళ్ళే చాలు
సప్తసాగరాలలో నీరు మొత్తం ఇంకు లాగా మార్చేస్తా
ఫాంటింగ్ పెన్నులోనా అదినింపు పెద్ద ప్రేమ బ్యానరే రాస్తా
ఠాంక్యూ ఠాంక్యూ నీ కానుకకి ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ కొత్త లవ్‌కి ఠాంక్యూ

చరణం 2

డైలి పేపర్ కొత్తగా పెట్టి లవ్లీ వార్తలు పంపిస్తాను
పేపరు గీపరు ఎందుకు నాకు పెదవుల మంత్రం చాలునంటా
టి వి చానల్ ప్రారంభించి తియ్యని కథలు చూపిస్తాను
చానల్ గీనల్ ఎందుకు నాకు చూపుల చిత్రం చాలు
కొత్త సాటి లైటునే తెచ్చి దాన్ని హార్టు షేపులో మార్చి
నాలో గాటు ప్రేమనే నింపి దాన్ని ఇంటి చుట్టూ తిప్పిస్తా
ఠాంక్యూ ఠాంక్యూ నీ పట్టుకి ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ పిచ్చికి ఠాంక్యూ

No comments: