30 September 2011

సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు

సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు

కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు
పగటివేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది
ఆయ్ పడుసు పిల్ల ఫక్కుమంది హహహ
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు

కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ బిక్కమొగమేసాడు
సుక్కలొంక చూసాడూ
బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు

మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు
బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే ఎర్రిమొహం ఏసాడు
హోయ్ మిర్రిమిర్రి చూసాడు హూ హోయ్
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు

విను నా మాట విన్నావంటే

విను నా మాట విన్నావంటే ఏ
జీవితమంతా ఆ ఆ పూవ్వుల బాట
విను నా మాట విన్నావంటే ఏ
జీవితమంతా ఆ ఆ పూవ్వుల బాట

ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే
విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట

బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ ఊరికి పేరూ తెచ్చేవాడివి నువ్వే నువ్వే
విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట

తల్లీతండ్రి ఒకరయినా దైవసమానం తల్లి సుమా
తల్లీతండ్రి ఒకరయినా దైవసమానం తల్లి సుమా
దీవిస్తుంది నీ అమ్మ దేవునిలాగే కనపడక
చల్లని మనసూ తీయని మమత చక్కని బ్రతుకూ నీదే నీదే
ఇది నీమాట ఆ విన్నానంటే ఏ జీవితమంతా ఆ పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా

వీణలేని తీగను నీవులేని బ్రతుకును

వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను
వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను
జీవించలేను మరణించలేను

మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది
నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది
మరువలేని మనసుకన్నా నరకమేముంది
ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది

వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది
తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది
తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది
పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది
జీవించలేను మరణించలేను

బండబారిన గుండె నాది పగిలిపోదు చెదిరిపోదు
నువ్వు పేర్చిన ప్రేమ చితిలో కాలిపోదు బూదికాదు
నిన్ను కలిసే ఆశలేదు నిజం తెలిసే దారిలేదు
చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం

వెన్నెల్లో ఈ నీలాకాశం

వెన్నెల్లో ఈ నీలాకాశం
కన్నుల్లో ఈ ప్రేమావేశం
మల్లెల్లో మన్మధ సందేశం
ఈ మధుమాసం మన కోసం ఊ ఊ
ఈ మధుమాసం మన కోసం

వెన్నెల్లో ఈ నీలాకాశం
కన్నుల్లో ఈ ప్రేమావేశం
మల్లెల్లో మన్మధ సందేశం
ఈ మధుమాసం మన కోసం ఊ ఊ
ఈ మధుమాసం మన కోసం
ఆహహా ఆహాహాహాహా
ఓహొహో ఓహోహోహోహో

హృదయాల మోహం అధరాల దాహం
చెలరేగు ప్రాయం ఈ యవ్వనం
సెగలైన తాపం పగలెల్ల శాపం
ఈ రేయి కోసం వేచింది పాపం
చందన చర్చలు శీతల సేవలు వద్దూ ఊ
ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు
ఆ చందన చర్చలు శీతల సేవలు వద్దూ ఊ
ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దూ
తొలిముద్దులో ఉంది తుదిలేని పాశం

వెన్నెల్లో ఈ నీలాకాశం
కన్నుల్లో ఈ ప్రేమావేశం
మల్లెల్లో మన్మధ సందేశం
ఈ మధుమాసం మన కోసం ఊ ఊ
ఈ మధుమాసం మన కోసం

మనసైన రాగం అనువైన తాళం
రచియించు గీతం ఈ జీవితం
ఆనంద గానం అందాల నాట్యం
సరిపాళ్ల పాకం శృంగార లోకం
అంగజుబారికి లొంగని వారలు ఎవరూ ఊ
శృంగారంలో నింగిని తాకిందెవరు
ఆ అంగజుబారికి లొంగని వారలు ఎవరూ ఊ
శృంగారంలో నింగిని తాకిందెవరు
ప్రతిరోజు తుది చూసి మిగలాలి శేషం

వెన్నెల్లో ఈ నీలాకాశం
కన్నుల్లో ఈ ప్రేమావేశం
మల్లెల్లో మన్మధ సందేశం
ఈ మధుమాసం మన కోసం ఊ ఊ
ఈ మధుమాసం మన కోసం

వెలుగు చూపవయ్యా మదిలో

పాహి రామప్రభో వరదా శుభదా
పాహి దీన పాలా ఆ
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా
వెలుగు చూపవయ్యా ఆ

మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
అందరికీ నీ అభయం కలదని
అనుకోమందువ దేవా ఆ
అనుకోమందువ దేవా ఆ
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

ఆ ఆ ఆ నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా ఆ
కడిగివేయునా రామా ఆ
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

ఆ ఆ ఆ కలరూపేదో కలవో లేవో
ఆ ఆ ఆ కలరూపేదో కలవో లేవో
ఎద ఉన్నది ఈ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా ఆ
ఎరుగలేము శ్రీరామా ఆ ఆ
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

శ్రీరామచంద్రా నారాయణా

శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
అయ్యో శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా

పగలంతా ఇద్దరము ఆలుమగలము
పడుకునే వేళకు పక్కలే దూరము
పగలంతా ఇద్దరము ఆలుమగలము
పడుకునే వేళకు పక్కలే దూరము
ఊరివారికందము ఉత్తుత్తి కాపురము
ఊరివారికందము ఉత్తుత్తి కాపురము
నోరూరతున్న మనకేమో ఓపలేని తాపము
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా

అన్నివున్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
అన్నివున్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా
ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి ఊరుకున్నా
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
అయ్యయ్యో శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా

కళ్లలోకి చూడకు కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్లు పడేవరకు మోమాట పెట్టకు
కళ్లలోకి చూడకు కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్లు పడేవరకు మోమాట పెట్టకు
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
కాచుకున్న వయసు కచ్చి అప్పుడే తీరును
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
ఓహో శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా

సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు

సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో

ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు

నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు

హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు హ్హ హ్హ హ్హ హ్హ హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

ప ని స హ్హ హ్హ హ్హ హ్హ స గ మ హ్హ హ్హ హ్హ
గ మ ప ఆ ఆ హ్హ హ్హ ని ని ప మ గ గ మ ప హ్హ హ్హ హ్హ హ్హ ఆ ఆ ఆ

ఆ ఆ చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా రవళించగా ఉహూ హ్హ హ్హ హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా ఆ ఆ ఆ ఆ
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ హ్హ హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు హ్హ హ్హ హ్హా
చిన్నారి పాపల్లె నవ్వూ హ్హ హ్హ హ్హ

హరిలో రంగ హరీ

శ్రీమద్రమారమణగోవిందో ఓ ఓ హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరి
శ్రీమద్రమారమణగోవిందో ఓ ఓ హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అబ్బాయిగారి పని హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అబ్బాయి గారి పని హరి

చల్లగాలి తగిలిందంటే పిల్లదానికి రెపరెపలు ||2||
పిల్ల గాలి సోకిందంటే కుర్రవాడికి గుబగుబలు ||2||
గుబులు రేగిన కుర్రవాడు కూడ కూడ వస్తానంటే
గూబ మీద చెయ్యి ఒకటి గుయ్యీమంటూ మోగిందంటే
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరి

వెంటపడిన కొంటే వాణ్ణి ఇంటిదాక రానిచ్చి
తోడు వచ్చిన దొరబిడ్డా ఆ పోయి రమ్మని తలుపే మూస్తే
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరీ హరిలో రంగ హరీ||వెంట||
తలుపు మూసిన తలుపుల్లోనా తరుముకొస్తూ వాడేవుంటే ||2||
తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి ||హరిలో||

దోర వయసు జోరులోన కన్నుమిన్ను కానరాక
జారిజారి కాలు జారి గడుసువాడి వడిలో పడితే
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి ||దోర వయసు||
మనసు జారి ఈ పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల ||2||
గడసువాడది తెలుసుకోక వడిని పట్టి లొట్టలేస్తే
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి

హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అమ్మాయిగారి పని హరి
హరిలో రంగ హరీ ఈ ఈ ఈ అబ్బాయిగారి పని హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరి హరి హరి హరి హరి హరి హరి హరి

మిస మిసలాడే చినదానా ముసి ముసి నవ్వుల నెరజాణ

మిస మిసలాడే చినదానా ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమే
సొగసరి చూపుల చినవాడా గడసరి మాటల మొనగాడా
సరసాలాడే సరదా తీరే సమయం రానీయరా ఆ సమయం రానీయరా

చారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి
చారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి
చిలకలాగ నువు కులుకుతు ఉంటే ఒలికి పోతదే నీ సొగసు
ఉలికి పడతదే నా మనసు
కులుకు చూసి నువు ఉలికితివా తళుకు చూసి నువు మురిసితివా
కులుకు చూసి నువు ఉలికితివా తళుకు చూసి నువు మురిసితివా
కులుకును మించి తళుకును మించి వలపుని దాచితి లేరా
అది కలకాలం నీదేరా
మిస మిస లాడే చినదాన ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే
నా చెంతకు రావేమే

ఏటి గట్టున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకోని
ఏటి గట్టున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకోని
గువ్వల జంటగ నువ్వు నేను కువ కువ లాడుతు ఉందామా
కొత్త రుచులు కనుగోందామా
కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే ఓ ఓ
కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే
నీవు నేను ఒకటైనామని కోవెల గంటలు తెలిపెనులే
దీవెనలై అవి నిలిచెనులే దీవెనలై అవి నిలిచెనులే
మిస మిస లాడే చినదాన ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమే
సొగసరి చూపుల చినవాడా గడసరి మాటల మొనగాడా
సరసాలాడే సరదా తీరే సమయం రానీయరా ఆ సమయం రానీయరా

29 September 2011

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి

28 September 2011

వాడిన పూలే వికసించెనే

వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే
తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
ఇల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే

వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము

తీయని కలలే ఫలియించెనే
ఇల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే

పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెల రేని వలెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే

జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే

అగ్గిపుల్ల భగ్గుమంటది

హా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓఓ
హ హ హ హ అగ్గిపుల్ల చీకటింటికే హ హ హ హ ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో కౌగిలింతలో నీ చింత తీర్చేసుకో
అహా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓ
హ హ హ హ అగ్గిపుల్ల అంటుకుంటదీ హ హ హ హ ఆడపిల్ల జంటగుంటదీ
అందమిప్పుడే అంటగట్టుకో నీ ముద్దు తీర్చేసుకో
అహా అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓఓ

చూపు తాకిడి సుఖమేముందీ చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం
చూపు తాకిడి సుఖమేముందీ చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం
దొంగ చేతిలో తాళం ఉందీ తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ
అంగుళానికో అందం ఉందీ బేరమప్పుడే పెంచుతు ఉంది
చౌక బేరమే సోకు లాభమే ఘరానాదొంగకి
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓ
హ హ హ అగ్గిపుల్ల చీకటింటికే హ హా ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో కౌగిలింతలో నీ చింత తీర్చేసుకో
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓ

దోరసరుకులు దొరుకుతు ఉన్నా దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా దోచుకుంటే నా కిష్టం
దోరసరుకులు దొరుకుతు ఉన్నా దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా దోచుకుంటే నా కిష్టం
కంటి చూపులో గారం ఉందీ వంటి నిండ బంగారం ఉందీ
కన్నె చూడనీ నేరం ఉందీ కమ్ముకుంటే శృంగారం ఉందీ
సొంత లాభము కొంత మానుకో చలానా వేళకి
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓ
హ హ హ హ అగ్గిపుల్ల చీకటింటికే హ హ హ హ ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో కౌగిలింతలో నీ చింత తీర్చేసుకో
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓఓఓఓ ఆడపిల్ల సిగ్గులంటది ఓఓఓఓ

అన్నానా భామిని ఏమని

అన్నానా భామిని ఏమని
ఎపుడైనా అన్నానా భామిని ఏమని
అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని ||2||
మాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనా
అన్నానా మోహనా ఏమని
ఎపుడైనా ఆ అన్నానా మోహనా ఏమనీ
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని ఆహా
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహనా ఎపుడైనా

లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని హ్మ్ హ్మ్
లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనా

నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ ఆహా
నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహనా ఎపుడైనా
అన్నానా మోహనా ఎపుడైనాఆ ఆ ఆ ఆ

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే అదే అదే అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది

నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయెను
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది

అటు చల్లని వెలుగుల జాబిలి

ఏ ఏహే ఓహొ ఒహో హో
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలి
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలి

వేగించే వంటరి వేళలో వణికించే ఈ చలి గాలిలో
వేగించే వంటరి వేళలో వణికించే ఈ చలి గాలిలో
నా తనువే తడబడుతున్నది చెలి సాయం కావాలన్నది
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలి

ఒక ఆడది ఒంటిగ దొరికితే మగధీరులకుండే తెగులిదే
ఒక ఆడది ఒంటిగ దొరికితే మగధీరులకుండే తెగులిదే
నీ గడసరి వగలిక చాలులే మ్మ్ హు లొంగే ఘటమిది కాదులే
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి జాబిలీ ఈ కోమలీ

నీ మదిలో సంగతి తెలుసులే అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే అది దాచాలన్నా దాగదులే
నువ్వు కోసేవన్ని కోతలే నీ పాచికలేవి పారవులే
అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి కోమలీ ఓ జాబిలి
ఊం ఊం ఊం హే హే ఓహో ఓహో

అందాల రాణివే నీవెంత జాణవే

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా ఆ
వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ వీరాధి వీరులే
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము ఓ ఓ ఓ
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నీరిక్ష చాల మంచిదీ ఈ
వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ వీరాధి వీరులే

క్రీగంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే
చాలులే చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము అహహా ఆ ఆ
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించే మోహము
నేనింక తాళజాలనే ఏ ఏ హే ఏ
అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా ఆ అందాల రాణివే

నీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము యేల ఈ ఆగము
ఆగుము ఆగుము ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను ఓ ఓ ఓ ఓ
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను
జగానికందము వివాహాబంధము ఆనాడే తీరు వేడుకా ఆ
అందాల రాణివే నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ
అందాల రాణివే నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ అందాల రాణివే

18 September 2011

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలంది మా ఇంటి పెళ్లి కళ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలంది మా ఇంటి పెళ్లి కళ
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా
కలలే కలిపినా అనుబంధంగా ఇళలో ఇపుడే సుముహుర్తంగా
ఎదురయ్యింది చల్లని వేళ కళ్యాణ లీల
అదర అదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్లిది కాదని జనమే నమ్మేట్టు

అరె అరె అదరదరగొట్టు ఇదివరకిలాంటి పెళ్ళి లేనట్టూ ఊ
హే మగపెళ్ళివారమంత వాలిపోయాం విడిదింటా
పనిలోపని పల్లకీని మోసుకొచ్చేశామంటా
మనువాడే శ్రీమాలక్ష్మిని తీసుకెళతాం మా వెంటా
ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రా రా పప్పర పప్ప పారా రా రా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రా రా
అదర అదర అదర ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్లిది కాదని జనమే నమ్మేట్టూ ఊ

ఓ ఓ ఓ ఓయ్ హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు హోయ్
పిల్లోడే కట్నం ఇచ్చుకోక తప్పదు హోయ్
హే హే హే మావాడు మెరుపు హోయ్ పోటి లేని గెలుపు హోయ్
స్విస్ బ్యాంకు ఏ రాసి ఇచ్చుకున్న చాలదు హే
వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు
హే చూసేస్తున్నాడే వరుడు లగ్గం ఎప్పుడన్నట్టు
ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో గుట్టు
తాపీగా ఉన్నారండీ తత్తర బిత్తర లేనట్టు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా ఆ

హే భూలోకమంతా వెతికిచూసుకున్నా హోయ్
ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు హోయ్
హో నీ కంటి పాప హోయ్ కోరి చేరుకున్నా హోయ్
వీరాధివీరుడు మా నిండు చంద్రుడు
హే అన్నీ తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా
ఆ అలనాటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్ళాడు
నీ కన్న తండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రా రా పప్పర పప్ప పారా రా రా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రా రా
అదర అదర అదర ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్లిది కాదని జనమే నమ్మేట్టూ ఊ

నీ స్టైలే చకాస్ నీ స్మైలే ఖలాస్

నీ స్టైలే చకాస్ నీ స్మైలే ఖలాస్
నీ ఎనకే క్లాసు మాసు డాన్సే హే హే హే
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దిత్తడి దిత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్
హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్ ఓ ఓ ఓ
ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే ఓ ఓ దీని తళుకు బెళుకు ఎహే సూపరే ఓ ఓ
హే కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు
కిస్సులేని జిందగీనే ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దిత్తడి దిత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్

గుండు సూది ఉన్నదీ గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నదీ కుట్టిపోవడానికే
మేరె దిల్ ఉన్నదీ నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే
తేలు లాంటి పిల్లడే వేలు పెట్టి చూడకే
తిమ్మిరి ఆగనందిలే ఓ ఓ ఏం జరగనివ్వు పర్లేదులే ఓ ఓ
ఏయ్ నిన్న దాక లొల్లి పెట్టి ఇప్పుడేంటే సుప్పనాతి
ఆడపిల్ల బైటపెడితే అల్లరల్లరవ్వదేటి
ఓసి నా తల్లో నీ స్మైలే ఖలాస్
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే


పలాష్ ఓయే చకాస్ ఖలాసే పలాసే హే హే హే హే ఓ ఓ ఓ ఓ
తేనెపట్టు ఉన్నదీ రేగిపోవడానికే చీరకట్టు ఉన్నదీ జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిటకిట పరువం నీకే
ఈడు ఎందుకున్నదీ గోల చెయ్యడానికే గోడ దూకడానికే ఓ ఓ
హే విదియ తదియలింకా దేనికే ఓ ఓ ఓ ఓ
హే విల్లు లాంటి ఒళ్ళు నాది భల్లు మంటూ విరచుకోరా
ఓంపుసొంపులోన ఉంది పాలధార పంచదార
ఏకమైసేయరో నీ స్మైలే చకాస్
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దిత్తడి దిత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ నీ స్మైలే ఖలాస్

పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు

పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు
పీ పీ పీ నోక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు
ఛీ పాడు పోరికోల్లంతా నా ఎనకే పడతారు
ఏందీ టెన్ సన్ యమా టెన్ సన్
హే మారుతి లో డైవింగు నేర్పిత్తానని సైదులు
ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇతనాని హబ్బులు
దొరికిందే సందంతా తెగ టెన్సన్ పెడతారందరూ
తింగ తింగ తింగరోళ్ళ టెన్ సను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్ సను
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు

హ హ మేరె ఆజా హ హ మేరె ఆజా
హ హ మేరె ఆజా ఏ ఆజా తూ గలే లగాజా

హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజెర్లా టెన్ సను
హే హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజెర్లా టెన్ సను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్ సను
హే పిల్ల తెల్ల పిల్ల ఏందే నీకీ టెన్ సన్
ఎడ పెడా గడ బిడా ఏం జరుగుద్దని నీ టెన్ సన్
హే నచ్చిందే పిల్లనీ నలిపేతారని టెన్ సను
నలుసంతా నడుముని గిల్లేత్తారని టెన్ సను
ఓణీకి ఒచ్చాకే వామ్మో మొదలైనాది టెన్ సను
తింగ తింగ తింగరోళ్ళ టెన్ సను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్ సను

మోనికా మోనికా హే హే
ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు హే హే
ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికే పెడతా నేనో టెండరు
హే అల్లాటప్పా ఫిగురూ ఎహే ఏందా నీకా పొగరు
చూపిస్తా నాలో పవరూ పిండేస్తా నీలో చమురు
హే నీ లాంటి ఒక్కడు దొరికే దాక టెన్ సను
నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్ సను
నీ దుడుకు దూకుడు ఏం సేత్తాడోనని టెన్ సను
టెన్ సను టెన్ సను టెన్ సను టెన్ సను
దూకు దూకు అరే దూకు దూకు
ఏ దూకు దూకు దూకుతవనే టెన్ సనోయ్
అరె దుమ్ము దుమ్ము లేపుతవనే టెన్ సనోయ్

ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్

ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్
ఓ ఓ బుల్లి నో నో నిమిడ బందా నిమిడ బందా బేబీ
ఓ బుల్లి నో నో నిమిడ బందా నిమిడ బందా బేబీ ఓ
ఓయ్ బసంతి ఓయ్ ఓ ఓయ్ బసంతి ఓయ్ ఏ

హే చుల్ బుల్లి నా చుల్ బుల్లి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి
ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్
ఓ నా చుల్ బుల్లి నా చుల్ బుల్లి అందాల దాడి చేసినావే ఆడపులి హోయ్

మాటల మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చూడాలి నీ అల్లీ బిల్లీ ఓ ఓ
నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి
చుల్ బుల్లి చుల్ బుల్లి గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ ఈ

పిట్టంత నడుమును ఎరవేసావే పిల్లోడి నిదరను ఎగరేసావే
ఆకలి కళ్ళ పోకిరిలాగా వదలక వెంట తిరిగావే
నాజూకు ఈతలు దురిచూసావే నేనెటు కదలని గిరి గీసావే
కుదరంత చేరిపేసావే చూపులతోన చెంపలు మీటి చెకుముకి మంటేసావే
కనుసైగలతోనే కవ్వించావే చెలీ నన్ను రా రమ్మని
మాటల మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ ఓ ఓ
చూడాలి నీ అల్లీ బిల్లీ ఓ ఓ
హే నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి లాలీ చాలీ
చుల్ బుల్లి చుల్ బుల్లి గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ ఈ

కుర్రా అమీనా సొరె యమ బాల సోమేమి యర యో యశో యశో
కాకీయ వకయీ యై యై కాకీయ వకయీ యై యై
అమిగేలోబిజోనా మకి మకి రాయోన కసో యశో
కాకీయ వకయీ యై యై కాకీయ వక

కుర్రా బాగ్దాద్ గజదొంగై నే రానా ఏకంగా నిన్నే దోచుకుపోనా
కనుగొనలేని చిలకల దీవి మలుపుల లోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటినా ఎలాగో నీ సరసకు రాలేనా
వింటున్నాచూస్తూ ఉన్నా నీ పదునైన మాటలలోని తికమక పడిపోతున్నా
హే ఎన్నటికైనా నువ్వు నా కూన రానా రానా జతైపోనా
మాటల మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చూడాలి నీ అల్లీ బిల్లీ ఓ ఓ

హే నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి
చుల్ బుల్లి చుల్ బుల్లి గుండెలోతుల ఖల్ బలి
చుల్ బుల్లి చుల్ బుల్లి ప్రేమలో మనసే బలీ ఈ కుర్రా

గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40

గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ ఊ
చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి నిదరే పోనందే నా కన్నూ ఊ
గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ ఊ
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమ మాయో చేసావే
ఓయే ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర సున్ తో జర జానే జానా దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

నువ్వు వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమెట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగి నేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
ఓయే ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర సున్ తో జర జానే జానా దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

గడియారం ముళ్ళై తిరిగేస్తున్నానే ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడుంటూ
డైలీ రొటీన్ టోటల్ గా నీ వల్లే చేంజ్ అయ్యింది చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంటు కుర్రాణ్ణి అవార లా మార్చేసావే
ఓయే ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా చెలియలా చేరిపోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం

నీ దూకుడూ ఊ సాటెవ్వడూ ఊ

నీ దూకుడూ ఊ సాటెవ్వడూ ఊ
హే జరా జరీ వచ్చీ ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషానా ధనా ధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్ మంటూ కలియబడి కలకలమే రేపే
బినా ఏ భళా బురా సోచే
Come on everybody
Let's go go go with it
నీ దూకుడూ ఊ ఫనా వె ఫనా వె ఫనా ఫనా వె
సాటెవ్వడూ ఊ ఫనా వె ఫనా వె ఫనా ఫనా వె

విషపు ఊడపడగలనే నరికివేయు తక్షణమే
పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే
వదలినావో దురితులనే ప్రళయమేరా క్షణక్షణమే
సమరమే సెయ్యిక చలగిక చకచక
ఎడతెగ చెయ్యిక విలయపు తైతక
పిడికిలినే పిడుగులుగా కలబడనీ

Oh! my god this is what we call దూకుడు Hey Hey
Everybody stand around say దూకుడు
నాననా నాననా నాననా నాననా నాననా నాననా
Don't you mess with me now సాలే Gonna take you down Dight and Day
ఫటక్ ఫటక్ Go Boom Boom Boom Boom

పుట్టు మచ్చలే చూస్తాలే ఏ ఉడ్ జాయేగా All your brain ఓ
జతులే గతులే It's a countdown
No matter where you're running don't you come to downtown
Boom Boom Boom Boom Boom Boom Boom Boom

నా దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు
సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడూ ఎవ్వడూ

గీత విను దొరకదు గుణగణమే చేవ గల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని వెనుపటినే పాదరసం ఉరవడి నరనరమే

కర్ దిఖాయే జర హటకే హోష్ ఉడాయే దుష్మన్ కే
సమరమే సెయ్యిక చలగిక చకచక
ఎడతెగ చెయ్యిక విలయపు తైతక
చొరబడుతూ గురిపెడుతూ కలబడుతూ
నాననా నాననా నాననా నాననా నాననా నాననా
హే హే హే హే హే హే హే హే హే హే హే హే హే హే హే హే
హే బచ్ గయా తూ సాలే ఉడ్ జాయేగా All your brain
కమాల్ హాయ్ కమాల్ హాయ్ ఈ దూకుడు
Stay the game Play the game దూకుడు

హే జరా జరీ వచ్చీ ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషానా ధనా ధనా కూల్చే జోరే
నీ దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు
సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడూ ఎవ్వడూ

ఓ ప్రేమా నా ప్రేమా ఆశగా నీ ప్రేమల్లో జీవించనీ

ఓ ఓ ప్రేమా నా ప్రేమా ఆశగా నీ ప్రేమల్లో జీవించనీ
నువ్వు లేక నేను లేనే నీకోసం వేచేనమ్మా ఆ చావే
ప్రియమా నా ప్రియమా నువ్వే నా సగమా
కన్ను మూసి కంటిలో కరిగినా నిన్నిలా విడిచినా
ఓ ప్రేమా నా ప్రేమా ఆశగా నీ ప్రేమల్లో జీవించెనే
నువ్వు లేక నేనే నీకోసం వేలిచేనమ్మా ఆ చావునే

నను వీడి పోతున్నా వస్తా నీకోసం
ఏచోట నీవున్నా ఎదలో నీ ధ్యానం
గాలిలా మారెనో నీ శ్వాసలో చేరెనో నీ
శ్వాసను విడిచి బయటకిపోక
నీలో వెలిసేమే ప్రియమా నా ప్రియమా
తనువే చెరి సగమా
నిన్నే తలచి కన్నీటిలో కరిగినా నిన్నేనా విడిచినా
హో ప్రేమా నా ప్రేమా ఆశగా మీ ప్రేమల్లో జీవించెనే

తుది వరకూ ఆరదులే ఇక నీ జ్ఞా పకం
కన్నీట ముగిసేదే ప్రేమల కావ్యం
నిన్నటి గాలులలో ఓ నీ కౌగిట రేగెనో
నీ చేతిలో వాలి ప్రేమలో తేలి
కాలం మరిచేనే ప్రియమా నా ప్రియమా
మనదే ప్రతి జన్మ
నిన్నే కోరి కన్నీటిలో కరిగినా ఉసురే విడిచినా

రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని

హం హుహుహుం రామ్మా దొరసాని ఆ Common White Lady
వినవమ్మా వివరాన్ని What
పాడుతున్నాడట Singing
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
We Welcome with వందనం ఓహ్ వందనం
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు Snake Dance
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు Elephant Hands
కోటి అద్భుతాలీవే చూడమ్మా Mavelous
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని

హో తోలు బొమ్మలు బొమ్మలాటలు
దేవలాలలో శిలకలలు ప్రతి రోజు ముంగిట పిండి ముగ్గులు
పిచ్చుకకు చీమలకు పిండివంటలు What's This
Food For పక్షుల్స్ Oh Really Yes
ఎన్ని జాతులో అంతా భరత సంతతి
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
All Brothers And Sisters But Parents Different
That's Great Thank You
ఇంటి ముందర అరుగులుండునే చూడు
ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు Free Out House
కన్నతల్లి మా దైవం చూడమ్మా Lovely
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని

హో వేల ఏల్లుగా వెల్లి విరిసినా తేనియ తెలుగే మా భాష
ఆ భక్త పోతన కవితా దీక్ష ఆచారాలకు అది రక్ష
Who Is That ఏం చెప్తే తెలిసి చస్తుంది
Old Poet Written Gold Lines
గాలి గంధమే ఇక్కడి నీరు తీర్థమే
మట్టి స్వర్ణమే మమతా క్షేత్రమే
ఆ Love You I ThoughtYour Paddle No No Lander Form
తప్పించుకున్నారా దేవుడా
వీర పుత్రులే కదం తొక్కినా నేల
మము వెన్నుపోటుతో నేల కూల్చడం న్యాయమా
ఏయ్ ఊరుకోవయ్యా బాబు మా కొంప ముంచేటట్టు ఉన్నావ్
వలల పర్వతం పడిపోయిందమ్మా అవునవును
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు
కోటి అద్భుతాలీవే చూడమ్మా

మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు

మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు
పడనీకే మాపున మును మాపునా
నిను మరల పిలుస్తా పోబోకే

మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు పడనీకే
మాపున మును మాపునా నిను మరల పిలుస్తా పోబోకే
బంకింగ్ హం కాలువలో నీరేగా మా గంగ
అందంగా బట్టలు ఉతికేటోల్లం
అరె ఓయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా
మేఘమా ఓ మేఘమా నీ తొలకరి జల్లులు పడనీకే
మాపున మును మాపునా నిను మరల పిలుస్తా పోబోకే

సూర్యుడి వెలుగులతోనే బట్టకి నిగ నిగ పెడతాం
చిట పట చినుకులు వస్తే మేము జూదమాట మొదలెడతాం
ర ర ర ఒక తాయం ఆరు ర ర ర ఒకే ఒక్క తాయం రెండు ఆర్లు
ర ర ర ఒకే ఒక్క చుక్క యెహ నువ్వెయ్యరా
ఓ కంచర గాడిద మీద గంపెడు మూటలు పెట్టి
ఆపై నింగిని నమ్మి ఇక మా జీవయాత్ర సాగిస్తాం
చాకలోడి బ్రతుకు కూడా దేవుడు తీరేలే
ఊరి వాళ్ళ పాపపు మూటలు మోస్తాం
ఒల్లంతా రొచ్చైనా ఏకంతో స్వచ్చంగా
ఆకాశంలాగే మనసే తెలుపు
అరె ఓయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా నువ్వు రాయ్యా

చేతిలో కాసులు లేవు మనసులో కపటం లేదు
మోసపు బతుకులు కావు అందుకే చీకు చింతలు రావు
హెల్లో సార్ దొర నీషక్తికి సిరా
ఇటొస్తే సరా మాదెబ్బతో హరా
బల్లో చెప్పే పాటం మాకేమీ తెలియదులే
అనుభవ పాటం చదివాం అందుకే ఓటమన్నదే ఎరుగం
ఒక ముక్కానీ ముక్కానీ ఒక ముక్కానీ ముక్కానీ
రెండు ముక్కానీ అనన్నరా రెండు ముక్కాలు అనన్నరా
మూడు పావలాలు ముప్పావలా మూడు పావలాలు ముప్పావలా
నాలుగు రూపాయిగా నాలుగు రూపాయిగా

తుండు వేసినా గుండుకుమల్లే తొలగని పేదరికం
బండకేసీ బాదుతుంటే బయమేదీ
తలవాలీ పోతున్నా మన బరువే పోరాదు
తల వంచని వీరుడిలా జీవిస్తా
అరె పోయా తప్పు కోయా పొద్దు వాలే ముందే పనినే చేద్దాం రాయా రాయ్యా ఆ ఆ ఆ
మేఘమా ఓ మేఘమా నీ జల్లున హాయిగా తడిసేము
మాపున మును మాపునా మా మనసును నీకు ఇచ్చేము

17 September 2011

ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి

ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి
వీడు మాయగాడు ఊహకందనోడు
వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు అంతుచిక్కనోడు
కోటి తలల తెలివికైన Question మార్కుడు

ఊ ఊసరవెల్లి ఊ ఊ యా యా యా యా ఊసరవెల్లి

Atom Bomb వీడు చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మాసుగాడు వేల రంగులోడు
Wrong నైనా రంగు మార్చి Right చేస్తడు

ఊ ఊసరవెల్లి ఊ అ ఊ అ ఊ అ ఊసరవెల్లి

You Can't Catch Him
You Can't Meet Him
You Can't Punch Him
You Can't You Can't You Can't You Can't Stop Him
You Can't Track Him
You Can't Chase Him
You Catch Catch Catch Catch Catch
ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి ఊసరవెల్లి

హే జాతరలో జీన్సు వేసుకున్న బుట్టబొమ్మలా

హే జాతరలో జీన్సు వేసుకున్న బుట్టబొమ్మలా
రాతిరిలో సబ్బు రాసుకున్న చందమామలా
విస్తరిలో నంజుకున్న ఆవకాయ గుమ్మలా
ఎడాపెడా ఎగాదిగా ఏమున్నావే కోమలా
రావే చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా హే
రావే చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా ఓయ్

మాటలతో పేలుతున్న కుర్రనాటు బాంబులా
చూపులతో కాలుతున్న పెట్రోమోక్సు బల్బులా
ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్సఫార్మర్ బాక్సులా
ఎడా పెడా ఎగా దిగా ఉన్నావు యమ దొంగలా
రారా చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా
రారా చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా

హే రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే
హే హే రాజహంశలా నువ్వలాగ నడిచొస్తే టెంత్ పోరెడైనా పెన్ను కదుపులే
హే వైజాగ్ బీచ్ రోడ్ లో వెల్తుంటే నాకు వెయ్యి లవ్వు లెటురులే
why not ఇంత ఫిగరుకి వెయ్యి కాదు లక్షొచ్చిన తప్పులేదులే
అసలెంత రేంజ్ లో నా అందం ఉన్నదా
నమ్మాలనిపిస్తుంది నివ్విట్టా ఎత్తేస్తుంటే
రారా చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా
రావే చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా

హే అర్దరాతిరి నీ రోడ్ లో పవరు పోతే
చీకటుండదంట నువ్వు నవ్వితే నవ్వితే నవ్వితే
హే ఆపరా మరి ఎన్ని మాయ మాటలైనా
తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే తవ్వితే తవ్వితే
లిల్లీ సన్నజాజికే నీ లేత ఒల్లు వల్ల క్రేజు తగ్గెలే
సిల్లీ ఊసులమల్లే అనిపిస్తూనే ఐసుచేసి ముంచుతావులే
పదివేల టన్నుల పరువాల వెన్నెల
ముందే ఉంటే పొగడకుండేది ఎలా ఎలా
రావే చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా హొయ్
రారా చేద్దాం దాండియా సదా ఊగిపోదా ఇండియా ఇండియా ఇండియా
ఓయే ఓయే ఓయే అహా అహా ఓయే ఓయే ఓయే అహా అహా

ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక

ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక
నిహారికా నిహారికా నువ్వేయానిక

హం నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటుంది నాప్రణమే నువ్వే నువ్వే రావలి
నువ్వే నువ్వే రావలి అంటుందె నాహ్రుదయమే

ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక

నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటా నంతే
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక

రెండు రెప్పలు మూతపడవుగ నువ్వుదగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నాచెంతకొచ్చినావొ నిన్నింక వదులుకోను చెయ్యందుకో
ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది
జీవితానికివ్వాలే చివరిరోజు అన్నట్టు మాటలాడుకున్నాముగ
ఎన్ని మాటలవుతున్న కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా
ఓ నిహారికా నిహారికా నువ్వే నాదారిక నాదారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక
నిహారికా నిహారికా నువ్వేయానిక

శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం

నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధమంటూ మొదలు పెట్టాకా
కంటికి కనపడాల్సింది Target మాత్రమే
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయు పుత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఓ భజరంగ బలి దుడుకున్నదిరా నీ అడుగులలో
నీ సరిలేరంటూ తన ఆశయ సాధనలో
ఓ పవమానసుతా పెను సాహస ముంగిట పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
దండించాలిరా దండదాలివై దుండగాల దౌత్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకాల శంఖం

ఓం బ్రహ్మాస్త్రము సైతము వమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాసమె పూదండవదా నీ మెడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో
అదే రధసారిగ మార్చద కడలిని పయణములో
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
భజే వాయుపుత్రం భజే బాల గాత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Love అంటే Caring

Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
ఏంటో నీ Feeling చెప్పేయ్ Darling
ఎటు అంటే అటు తిప్పుతాలే నా Steering
Love అంటే దొంగల్లే Secretగా కలవాలే
Friend అంటే దొరలా Meet అయ్యే Chance లే
Love అంటే Red RosE కోపంగా ఉంటాదే
Friendship White RosE Cool గా ఉంటాదే
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing

ఓసారి Love Better అంటాడు
ఓసరి Friend Great అంటాడు
ఏ రోజెలా వీడుంటాడో వీడికే Dought
ఓ సారి Dear అని అంటాడు
ఓ సారి Fear అని అంటాడు
ఏ Mood లో ఎప్పుడు ఉంటాడో No Updatu

నీ కంట నీరొస్తే నా kerchief అందిస్తా
మళ్ళీ అది శుభ్రంగా ఉతికిచ్చే Wait చేస్తా
నీ కాళ్ళు నొప్పంటే నిను నేనే మోసుకెల్తా
దింపాక నీతోనే నా కాళ్ళు నొక్కిస్తా
Sim Card తెమ్మంటే Cell Phone తెచ్చిస్తా
నువ్వు Swith Off లో ఉన్నా Ringtone మోగిస్తా
Address చెప్పంటే Drop చేసి వచ్చేస్తా
Petrol కై నీ Credit CardE గీకేస్తా
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing


Love అంటు చెప్పాలంటే I Love You చాలే
దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైనా నే Sorry చెపుతాలే
Hey Friendship లో Ego లేదని నే చూపిస్తాలే
నిన్నైనా నేడైనా నేడైనా రేపైనా
రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైన వానైన కన్నిరుండే దారైనా
ఏమైన గాని తోడుండే వాడే Friend అంట
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
రంగుల రంపమై కోస్తివే సంపెంగో
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో
కొంగు మీద ఉన్న mango ఏ ఏ
నిన్ను కోసి తింటా కోమలాంగో ఏ ఏ
సింగమంటి నిన్ను జాంగో ఏ ఏ
నీ మారు పేరు తేనెటీగో ఏ ఏ
కోరిక కొవ్వైనా కొంటెరెప్పల్లోన
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో

మడత చూస్తే మంగోలియ
నునుపు చూస్తే నైజీరియ
మాయదారి మంచూరియ
పిల్ల నడుమేరియ
ఓ ఏలంగో లంగో
ఆ ఉడుకు చూస్తే ఉప్పెనయ
సరుకు చూస్తే సైబీరియ
కమ్ముకుంటే కుర్ర మఫియ
గరా గరం ఐపోయా
ఓ ఏలంగో లంగో
హే దూదిలాంటి సోకు నీది ఏ ఏ
ఉగ్రవాది చూపు నీది ఏ ఏ
కొండచిలువని జింకపిల్లను ఆగలేను ఆకలంది
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో

యుద్దమేమి జరగలేదులే రక్తమేమి చిందలేదులే
ఉపిరైతే ఆగినాదినీ ఓర ఓర చూపుల్లో
ఓ ఏలంగో లంగో
హే పైటచెంగు నలగలేదులే బొట్టుకూడ చెరగలేదులే
అందమంత ఈడేరేని సల సల తాకిడిలో
ఓ ఏలంగో లంగో
హే కాక మీద గౌజు పిట్ట ఏ ఏ నీ పంజరాన గింజుకుంట ఏ ఏ
పుట్టుమచ్చ గంట పచ్చబొట్టు గంట మాసిపోని ఉత్తరంట
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో

నేనంటేనే నాకు చాలానే ఇష్టం

నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హో ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిల్లు ఎరుపయ్యే సూరీడు చూపైనా
నాచెయ్యి దాటందే నిను తాకదే చెలి
వెక్కిల్లు రప్పించే ఏ చిన్ని కలతైనా
నాకన్ను తప్పించి నిను చేరదే చెలీ చెలీ చెలీ
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తలమోసేలా హో హో
పూలన్నీ నీసొంతం ఓ ఊల్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం ఆదేగ నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చెనా హో
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం

చేదు బాధ లేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హుం హుం హుం హే హే హే
హొ హొ హొ హుం హుం హుం

పెల పెల పెల మంటు పిడుగల్లే

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
సర సర సర మంటు విషమల్లే
నర నరం పాకింది తొలి ముద్దు
గబ గబ గబ మంటు గునపాలే
మెదడును తొలిచింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే వదలనులే చెలి చెలీ
నిన్నే మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి చెలీ
నిన్నే మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంతా తిమిచీరే ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధురణాలలే కదిపి కుదుపుతోంది చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే
ఒక జనణం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే సతగ్నులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్సే ఓ ఓ చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

ఒక క్రోదం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే
ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే
ఒక యోధం ఒక యజ్ఞం నిర్విగ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా ఆ ఆ ఆ
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు

హు హా హే హా
టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ
పింగు పాంగు బాడి జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే రప ప ప ప
పింగు పాంగు బాడి జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ
టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ
చం చం చంచం చం చం చంచంచంచంచం
చం చం చంచం చం చం చంచంచంచంచం

వేళ లేని పాళ లేని వెర్రిలో వేడి బుగ్గలంటుకుంటే వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో పాల ఈడు పాయసాల కోరికా
సమ్మర్ ఇంటి సాల్టు సందెవేళ బోల్టు అందమైన స్టార్టు ఆకశాన హల్టు
సొమ్ములప్పుచేసి సోకు చూసుకోనా సొంతమైన దిచ్చేసి సోమసిల్లి పోనా
షేకు నిన్ను చేసేసి షాక్ చూసుకోనా బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా
తడి సరకుల ఒడి దూడుకుల ముడి సరకుల ముడి విడుపులలో హొ
పింగు పాంగు బాడి జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ
టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ
చం చచంచం చం చచంచం చం చచంచంచం
చం చచంచం చం చచంచం చంచంచచంచచంచచం

మత్తు మత్తు ఊగులాట మధ్యలో ఎత్తుకున్న పాటకేది పల్లవీ
కొత్త కొత్త కొంగులాట మధ్యలో మోత్తుకున్నమోజులన్ని పిల్లవీ
పైన కోకోనట్టు లోన చాకిలెట్టు ఈడు స్పీడ్ జెట్టు ల్యాండ్ కాదు ఒట్టు
కన్నుమాటలన్నేసి నిన్ను కమ్ముకోనా ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా
చెంప చేతికిచ్చేసి చేమగిల్లి పోనా తేనే పట్టు ఒగ్గేసి తెప్పెరిల్లి పోనా
కచటతపల కసి వయసుల గచట ఎప్పుడు చలి ముడి పడునో హొ
టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ
పింగు పాంగు బాడి జింగు షింగు లేడి
తాకితేనే పిచ్చ తాకిడీ
లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు చుక్కలేల చందమామ వీడు
గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే దాదదూదు దీదిదాద
టిప్పు టాపు లుక్కు లిప్ మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగు పాంగు బాడి
జింగు షింగు లేడి తాకితేనే పిచ్చ తాకిడీ
హే రపపాపపప రపపాపపప రంపపాప రంపపాపపా

13 September 2011

ఓ హలో హలో హలో లైలా

ఓ హలో హలో హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో కళ్లముందే
దాగి ఉండు పగటిపూట తారలా
హలో హలో హలో చాలా
చేసినావు చాలులేరా గోపాలా
నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు
నాటకాలు ఆడమాకలా
ఐతే నా మనసు నిన్ను చేరిన ట్టు
నీకు కూడ తెలిసినట్టే
ఐనా ఆ ముందు అడుగు వేయకుండా
ఆపుతావు అదే మిటే
పెదాలతో ముడేయనా
ప్రతిక్షణం అదే పనా

ముద్దుదాకా వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి
కావాలమ్మా కౌగిలి కౌగిలి ఓ చెలీ చెలీ
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
చే స్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరి
అమ్మో నా లోపలున్నదంతా
అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్నా గొప్ప ఆశ
ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా
అనుక్షణం అదే పనా

ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మది మది
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
నీదే పూచీ నీదిలే నీదిలే భలే భలే భలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మా
సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేళదాకా
తీరమైన చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా
క్షణక్షణం అదే పనా

11 September 2011

మంగళము రామునకు మహిత గుణదామునకు

మంగళము రామునకు మహిత గుణదామునకు
మంగళము కారుణ్య నిలయునకును
మంగళము రామునకు మహిత గుణదామునకు
మంగళము కారుణ్య నిలయునకును
మంగళము జానకీ మానస నివాసునకు
మంగళము జానకీ మానస నివాసునకు
మంగలము సర్వ జన వందితునకు
జయమంగళం నిత్య శుభ మంగళం
జయమంగళం నిత్య శుభ మంగళం
జయమంగళం నిత్య శుభ మంగళం
జయమంగళం నిత్య శుభ మంగళం

శంఖు చక్రాలు పోలిన కూనలారా

శంఖు చక్రాలు పోలిన కూనలారా
ఆ శ్రీరామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
ఆ రామయ్య కథ సెపితే
ఇంక ఆలించి ఊ కొడతరు
ఆ రావులోరి పాటలకి
ఆదమరిసింక నిదరౌతరు
అహ రామ లాలినే ఆపావంటే
అమ్మమ్మ గీ పెడతరు
శంఖు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
తర తన్నాన తరనాన తర తన్నాన తరనాన
తర తన్నాన తననాన తర తన్నాన తరనాన

సప్తాస్వరధ మారూఢం

సప్తాస్వరధ మారూఢం
ప్రచండం కస్యపాత్మజం
స్వేత పద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహమ్
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ ఆ సార్వభౌమాయ మంగళం మంగళం

ఇది పట్టాభిరాముని ఏనుగురా

ఇది పట్టాభిరాముని ఏనుగురా
గద జట్టీలు ఎక్కినాదిరా
ఇది సీతమ్మ వారి ఏనుగురా
మీరు చెప్పింది చేస్తదిరా
ముద్దు ముద్దైన కూనలతో
ఇక పొద్దాక ఆడతది
ఇహ ఇద్దరిని ఎత్తుకోని
రాములోరి కోటంతా సూపిస్తది
ఇది రావులోరికి జై అనమంటే తొడమెత్తి జై కొడతది

ఇది పట్టాభిరాముని ఏనుగురా
గద జట్టీలు ఎక్కినాదిరా
ఇది సీతమ్మ వారి ఏనుగురా
మీరు సెప్పింది సేస్తదిరా
ఆ పట్టాభిరామునికి జైజేలురా
లవకుశులకు జైజేరా
రాణి సీతమ్మ తల్లికి జైజేలురా
లవకుశులకు జైజేరా

శంఖు చక్రాలు పోలిన కూనలారా
ఆ శ్రీరామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
ఆ రామయ్య కథ సెపితే
ఇంక ఆలించి ఊ కొడతరు
ఆ రావులోరి పాటలకి
ఆదమరిసింక నిదరౌతరు
అహ రామ లాలినే ఆపావంటే
అమ్మమ్మ గీ పెడతరు
శంఖు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
తర తన్నాన తరనాన తర తన్నాన తరనాన
తర తన్నాన తననాన తర తన్నాన తరనాన

కలయా నిజమా వైష్ణవమాయ

కలయా నిజమా వైష్ణవమాయ అవునా కాదా ఓ మునివర్య
జరిగేదేది ఆపగలేను జనని వ్యధని చూడగలేను
కలయా నిజమా ఆ ఆ ఆ ఆ

పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా

కడలే దాటి కలిపిన నేను ఇపుడీ తీరుకి ఏమైపోను
శ్రీరామ ఆజ్ణ ఎదురించలేను
దారిఏది తోచదాయె తెలుపుమయా

రామ రామ రామ అనే రాజమందిరం

రామ రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రాజమందిరం బాల సుందరం

ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట
ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట
బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట
రామ రామ
రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట
వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట
సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట
ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట

దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ
రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ
అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని
బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా..

రామ రామ రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

పాలబువ్వ తినమంటే మేడపైకి పరుగులంట
పసిడి బిందె లోని పన్నీరు ఒలకబోస్తడంట
సందమామ కావాలని సందెకాడ గొడవంట
అద్దములో సూపిస్తే సంచిలోన దాసెనంట
శ్రీరాముడైనా చిన్నప్పుడూ ఇంతే
ఆకాశమంటే అల్లరి చేసాడంట

రామ రామ రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

అమ్మ నాన్న అన్ని మాకు నువ్వె కాద అమ్మ
ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పుని మన్నించమ్మా

రామ రామ రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రాజమందిరం బాల సుందరం
ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట
ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట
బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట
రామ రామ రామ రామ
రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

08 September 2011

సీత సీమంతం రంగరంగ వైభవములే

ఆ ఆ ఆ ఆ ఆ సీత సీమంతం రంగరంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే
మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే
అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే
కాశ్మీరమే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంచే
కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి ఒక్క పనిచేయనీవరే
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి
పురుడు పోసినట్టు జరుగులే
మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో
పసుపు కుంకుమిచ్చినట్టులే
రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే
అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లుచేరులే
ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే
అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే
ఎక్కడున్న నువు గాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు
దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే
వేదమ్ము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే
శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా
దేవే సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా
నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా
నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
సర్వ సస్తాస్త్ర శక్తి ప్రభాధారనా
సత్య సింహాసనా ధర్మ సంస్తాపనా
న్యాయ విశ్లేషణా కోషనా
స్నేహ సంభాషణా భూషనా
వేద వేదాంగ శాస్త్రార్ద విద్యాధనా
ఆది కావ్యాభితానంద సంవర్దనా
నావ సీత సతీ ప్రాణనాధా
సదా జానకీ ప్రేమ గాధా
మహారాగ్ని వైదేహి వీణా వినోదా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమహ
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమహ

రామాయణము శ్రీ రామాయణము

రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము అనుపమానమూ
అనురాగము అనుబంధము అనుపమానమూ
సహనశీల ధీర వీర వరగభీరమూ
సహనశీల ధీర వీర వరగభీరమూ
రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము

శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం శ్రీరామ పట్టాభిషేకం
ఉప్పొంగిపోయే ఆ దేశం ఉప్పొంగిపోయే ఆ దేశం
కలవరం తెచ్చింది కైకకిచ్చిన వరం
ఆనలకు పంపమని లేక ఏ కనికరం
పదునాలుగేండ్లు శ్రీరాముని వనవాసమును చేయమన్నది
వనవాసమును చేయమన్నది

చెదరని దరహాసం కదిలెడు వనవాసం
చెదరని దరహాసం కదిలెడు వనవాసం
వదిలె రాణి వాసం వచ్చే మగని కోసం
తండ్రీ మాటకోసం కొడుకు తండ్రికోసం
తండ్రీ మాటకోసం కొడుకు తండ్రికోసం
భార్య భగనికోసం లక్ష్మన్న అన్న కోసం
జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం
జగమంతా ఆక్రోశం

ఏమయ్యా రామయ్యా ఏమైపోవలయ్యా మేమేమై పోవాలయ్యా
ఏమయ్యా రామయ్యా ఏమైపోవలయ్యా మేమేమై పోవాలయ్యా
అటు పురజనులు ఇటు దశరధుడు వెక్కి ఏడ్చినారు
మొక్కి ఆపినారు
సత్య వచనమై సాగెను రఘుపతి
ధర్మ కవచమై అనుసరించె సతి
లక్ష్మనుడేగెను వినయశీలుడై
అయోధ్య మిగిలెను అమావాస్యయై
అయోధ్య మిగిలెను అమావాస్యయై

రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము అనుపమానమూ
అనురాగము అనుబంధము అనుపమానమూ
సహనశీల ధీర వీర వరగభీరమూ
సహనశీల ధీర వీర వరగభీరమూ
రామాయణము శ్రీ రామాయణము రామాయణము రామాయణము

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు
ఘోరం ఆపేదెవరు ఎవరూ ఎవరూ
రారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
సాగె ఈ మౌనం సరేనా
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది
అడగండి న్యాయం ఇదేనా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ

ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం
ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరార
అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగ పొలేద ఈ రధముని ఆపగలేదా
విధినైన కాని ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ

అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే
రక్కసివిధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా
సుగుణంతో సుర్యుని వంశం వెలిగించే కులసతిని
ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైన కాని
నీమాటేనీదా వేరే దారేది లేద
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు
ఘోరం ఆపెదెవరు ఎవరూ ఎవరూ

రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
అడగండి న్యాయం ఇదేనా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు
రామా వద్దనలేరా ఒకరూ

07 September 2011

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది
సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ మనసంతా వెలిగించి నిలిపేనిదీ
సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరథ రాజు
అతని కులసతులు గుణవతులు ముంగురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రగువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌషికు డేతించెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకిని చంపే
యాగమే సఫలమై కౌషిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం
నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగ సాగునింక జానకీయని
సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమ్రుత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే హృదిమి సీత
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

శ్రీరామ లేరా ఓ రామా

శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమా
మదిలో అసురాళిని మాపగరా
మద మత్సర క్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా
శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగరా
ఆ ఆ ఆ ఆ ఆ
దర్శనమునుకోర దరికే చేరే దయగల మా రాజు దాశరధి
తొలుతనె ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియ వాది
ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహపరమై మేలు ఒసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగుడుదులే
మా శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగరా
సీతారామ చూపే నీ మహిమ ఆ ఆ ఆ

తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడ మధురం
సమయం అంతా సఫలం
ఇది రామ ప్రేమలోకం ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం ఆ ఆ
శ్రీరామ రామ రఘు రామ
పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతాభామ ప్రేమారాధనమా
హరికే హరిచందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ ఊ ఊ ఊ

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితం
కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
అండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ

సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్పనఖ
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగ
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి
అన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను రక్కసి

దారునముగ మాయ చేసె రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడు
అదను చూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి
కరకు గుండెలోపాసుల కాపలాగ వుంచి

శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరధి
సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా
రోధించే సీతాపతి

రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం
కమలనయనములు మునిగే పొంగేకన్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో

వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి
సీత సిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చి

వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
వానరవేగముగ రామభద్రుడె రావణ తలపడికొట్టెర
భుజమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెగా
అంత బాధ పడి సీతకోసమని ఇంత చేసె శ్రీరాముడు
చెంతచేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
వయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీపరిక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ

అగ్గిలోకి దూకే అవమానముతో సతి అగ్గిలోకి దూకే అవమానముతో సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహొత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె నేటి శ్రీరాముడు
ఆ జానకితో అరణ్యమేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు

ఎవడున్నాడీలోకంలో ఇదివరికెరుగనివాడు

ఒకరోజు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను

ఎవడున్నాడీలోకంలో ఇదివరికెరుగనివాడు
ఎవడున్నాడీకాలంలో సరియగునడబడివాడు
నిత్యము సత్యము పలికే వాడు
నిరతము ధర్మము నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యుని వలెనే వెలిగెడి వాడు
ఎల్లరికి చల చల్లని వాడు
ఎదనిండా దయదల వాడు
ఎవడు ఎవడు ఎవడు

అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు

ఒకడున్నాడీలోకంలో ఓంకారానికి సరిజోడు
ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
నిలువలు కలిగిన విలుకాడు
పలు సుగుణాలకు చెలికాడు
చెరగని నగువుల నెలరేడు
మాటకు నిలబడు ఇలరేడు
దశరధ తనయుడు దానవ దమముడు జానకి రామణుడు అతడే
శ్రీరాముడు శ్రీరాముడు

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆ
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాఆ అ ఆ
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె
రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే
రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం
రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా


మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా