షడ్జమం భవతి వేదం
పంచమం భవతి నాదం
శ్రుతి శిఖరే నిగమహరే స్వరలహరే
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోరుసేయ్ నావబారు సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీతగా
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగంఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను
కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకంతాల వలపు
అల పాపి కొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
గోదావరి Move ful songes
ReplyDelete