18 November 2007

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేం కావాలి
నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి
ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా

గరిసనిసమగరిస సగమనినిపమగమ
పపమగ మమగస గగసనిస
చిరు చిరు మాటలు పలికేవేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసేవేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వనవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కీ ఎడ్చే వేళ కన్నీళ్ళవుతా
నేస్తాన్నవుతా గురువు అవుతా పనిమనిషి తన మనిషవుతా
నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలీ
వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సిమ్హాద్రి పాట మనసార వినమంటా
తన తియ్యని పాటే అమ్మ పాడే లాలి
తన తోడే ఉంటే అది దీపావళి
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి

No comments:

Post a Comment