వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నెలు దోచాడే
అహహ్ వేయి వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్నె తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడే
మోహనము వేణువూదే మోహనంబుడితడేనె
మోహనము వేణువూదే మోహనంబుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి వేలా గోపెమ్మలా
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య కాలాన వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి వేల గోపెమ్మల
No comments:
Post a Comment