24 November 2007

పందొమ్మిది వందల యెనభై వరకు

పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి ఒక పిల్ల నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా

ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది
ప్రేమకు ఈడెందుకు పెళ్ళికి ప్రేమెందుకు
ప్రేమకు పెళ్ళి తోడు పెళ్ళికి ప్రేమ తోడు
అమ్మ తోడు అయ్యతోడు నీకు నాకు ఈడు జోడు
హోయ్..హోయ్..

మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
జోడు పెరుగుతుంటే వయసు తరుముతుంది వయసు తరుముతుంటే సోకు పెరుగుతుంది
మనసుకు సోకెందుకు వయసుకి మనసెందుకు
మనిషికి మనసు అందం మన్సుకి ప్రేమ బంధం
ఈ అంధం ఆ బంధం ఇద్దరి వివాహ బంధం
హోయ్..

No comments:

Post a Comment