24 November 2007

తల తలమణి కులుకుల వని కనపడుతుంటె మతి పోద కుమారీ

తల తలమణి కులుకుల వని కనపడుతుంటె మతి పోద కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందె యెటువున్న నీ దారీ
నిన్ను చూసి పారిపోయిందె నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
పైకెం వినలేని రాగం మనలోని మౌనం కరిగించనీ
ఇంత కాలం బరువైన ప్రాయం అడిగె సహయం ఒడిచేరనీ
పాపం ప్రియురాలి తాపం అనిగె ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఎన్ కావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వలీ
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరలి
నమ్మకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మది ముచ్చటలో

లోలో రుస రుసలు రేపే తహ తహలు ఆపే సమయం ఇది
నాలో గుస గుసలు నీతో పదనిసలు పాడె వరసే ఇది
అందుకోని తెరచాటు దాటె జవరాలు చాటె వివరాలన్నీ
కాని నిలువెల్ల నాటె కొన గోరు మీటె కొంటె ఆటనీ
ముద్దు పెట్టక నిద్దర పట్టక బిత్తర పోయిన కొమ్మలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చెయ్యాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవలి

No comments:

Post a Comment