వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
||వేదంలా||
రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
||వేదంలా||
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తితి మావహంచ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రి పురుషా సంపూజితా వస్సురై ర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనమూ
||వేదంలా||
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగ మొకడు మిగిలెను చాలూ
||వేదంలా||
No comments:
Post a Comment