13 February 2010

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

అందమై.. మకరందమై
మందబంధ మలయానిత గంధమై
మదనుని విరివిల్లున అరవిందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై.. ఎలతేటి ఎద మీటు ఆనందమై..
పులకరించు కుసుమమా.. పులకరించు కుసుమమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

ఆటవై.. సయ్యాటవై..
చిలిపి వలపులాడే చెలగాటమై
తలపుల తత్తరల తచ్చాటవై..
పరువాల సరదాల బూచాటవై..పరువాల సరదాల బూచాటవై..
కరిగిపోవు స్వప్నమా.. కరిగిపోవు స్వప్నమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

వాణివి.. వర వీణవై
బృందావన సమ్మోహన వేణువై
పదకవిత మృదుబాషల బాణివై
అనురాగ రాగాల నెరజాణవై.. అనురాగ రాగాల నెరజాణవై..
గానమై మౌనమా.. గానమై మౌనమా..

గాలివై.. చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల వేళవై
కనుసన్నల తెలివెన్నెల జాలువై
జోజోల ఉయ్యాల జంపాలవై .. జోజోల ఉయ్యాల జంపాలవై ..
సేదదీర్చు నేస్తమా.. సేదదీర్చు నేస్తమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

No comments:

Post a Comment