పల్లవి :
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ
వింతకాదు నా చెంతనున్నదీ
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి
చరణం:
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవులమీదికి రానీవు (2)
పెదవికదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
!! వెండి వెన్నెల !!
చరణం: కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి ఏమార్చేవు (2)
చెంపలు పూచే కెంపులు నాతో నిజముతెలుపునని జడిసేవు
!! వెండి వెన్నెల !!
చరణం: అలుకచూపి అటువైపుతిరిగితే అగుపడదనుకొని నవ్వేవు (2)
నల్లనిజడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను
!! వెండి వెన్నెల !!
No comments:
Post a Comment