13 February 2010

లైలా ఆ ఆ ఆ లైలా లైలా ఆ ఆ

లైలా ఆ ఆ ఆ లైలా లైలా ఆ ఆ
నిరుపేద మనసునే మురిపించి నీవు
రతనాల మహలులో నిదురించినావా
లైలా ఆ ఆ ఆ లైలా ఆ ఆ ఆ
బంగారు గూటిలో పడివున్న చిలుకను
పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును

ఇకనైన నను చేర రావా
ఇకనైన నను చేర రావా
ఒకసారి నీ మోము తిలకింప నీవా
ఇకనైన నను చేర రావా ఆ ఆ ఆ
నీతోడు నడయాడ లేను
నీ ప్రేమ ఏనాడు విడనాడ లేను నే విడనాడ లేను

లైలా ఆ ఆ ఆ లైలా ఖైస్‌. లైలా లైలా ఖైస్‌
అందని పండును కోరీ అర్రు సాచే వెర్రివాడా
అంతటి లైలాను వలచే అర్హత నీ కెక్కడిదిరా
బ్రతుకుమీద ఆశవుంటే
పారిపోరా యిప్పుడే. యిప్పుడే
ప్రేమించిన వాడెవ్వడు పిరికివాడు కాడు అనురాగ ప్రవాహాన్ని
అడ్డగించ లేడెవ్వడూ ఎవ్వరెంత కాదన్నా
మా అనుబంధం శాశ్వతం
లైలాకే నా జీవితం అలనాడే అంకితం
ఏయ్‌ నోర్ముయ్‌ వదరుబోతా
పట్టండి పట్టండి కత్తుల బోనులో నిలబెట్టండి
నిలువెత్తు గోతిలో పాతిపెట్టండి

కత్తులు ఛేదింపలేవు నిప్పులు దహియింపలేవు
స్వచ్ఛమైన ప్రేమను ఏ శక్తులూ బంధింపలేవు

అనురాగమన్నది విడదీయలేనిది
అది వున్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది

కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడు మాపలేనిది
అనురాగమన్నది విడదీయలేనిది
అది వున్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది

విరబూసే పూలలో మా చిరునవ్వులే ఉంటాయి
కదిలే చిరుగాలిలో మా కనుల బాసలుంటాయి
పొంగే కెరటాలలో మా వలపు పొంగులుంటాయి
కలిసే మేఘాలలో మా కన్నీటి ధారలే వుంటాయి
ఐనా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం
నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం
వెలుతురున్నంతకాలం కాలమున్నంతకాలం
ధర్మమున్నంతకాలం దైవమున్నంతకాలం
ఇలలోన మిగిలేను ఈ విషాద గాధా

ఓహో ప్రియతమా ప్రియతమా ఆ ఆ
నా పిలుపే వినలేవా నీ చెలినే కనరావా
ఎందున్నావో ఏమైనావో
ఎందున్నావో ఏమైనావో
ప్రహరీలు దాటి పహరాలు దాటి పయనించి నే వచ్చినాను
ప్రళయమ్ముగాని మరణమ్ముగాని
నిను వీడి నే నిలువలేను ఎందున్నావో ఏమైనావో

ఇక్కడే వున్నాను ఎక్కడికీ పోలేను
కడ వూపిరితో నీకై కలవరించినాను
కన్నుమూసినా నీకై వేచి వేచి వుంటాను
వేచివేచి వుంటాను వేచివేచి వుంటాను

నీవు లేని ఈ లోకం నరకం
నీవున్న చోటే నా స్వర్గం నిన్నే కలుసుకోనీ
నీలో కలిసిపోనీ కలిసిపోనీ

కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను
మా ప్రేమగాధ ఈ అమరగాధ

No comments:

Post a Comment