మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు (౨)
శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మంచిని తలపెట్టినచో మనిశి కడ్డు లేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
(మానవుడే)
దివిజగంగ భువిదించిన భగీరధుడు మానవుడే
సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే
సృశ్టికిప్రతిసృశ్టిచేయువిశ్వామిత్రుడు నరుడె
జీవకోటి సర్వములొ శ్రెసటతముడు మానవుడే
(మానవుడే)
గ్రహారాశులనధిగమించి ఘన తారల పధమునుంచి (౨)
గగనాంతర రోధసిలో గంధర్వగోళగతుల దాటి (౨)
చెంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
No comments:
Post a Comment