నీలాల కన్నుల్లో మెల మెల్లగ..
నిదురా రవమ్మ రావె...నిండర రావె...
నెలవంక చలువల్లు వెదజల్లగా..
నిదుర రావమ్మా రావె... నెమ్మదిగా రావె...
ఓ.. ఒ.. ఒ..
చిరు గాలి బాల పాడింది జోల.. పాడింది జోల..
ఎద దోచెనమ్మా... ఏవేవో కలలు...
కలలన్ని కలలెన్నొ విరబూయగ...
నిదుర రావమ్మ రావె.. నిండార రావె...
||నీలాల||
ఓ..ఒ..ఒ..
నిదురమ్మ ఒడిలొ ఒరిగింది రేయి.. వూగింది.. లాలి...
గగనాన్ని చూసి.. ఒక కన్నుదోయి..
వినిపించమంది.. ఎన్నెన్నొ కధలు..
కధ చెప్పి మురిపించీ మరిపించగ...
నిదుర రావమ్మా రావె.. నెమ్మదిగా రావె...
||నీలాల||
No comments:
Post a Comment