13 February 2010

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

మల్లెపూల పడవలో..ఆ..ఆ
మంచుతెరల మాటులో..ఆ..ఆ
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
మల్లెపూల పడవలో..
మంచుతెరల మాటులో..
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తడిసిపోయి యవ్వనం వెతుకుతుంది వెచ్చదనం
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..
ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
పొన్నచెట్టు నీడలో..
ఎన్ని ఎన్ని ఊసులో..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

No comments:

Post a Comment