12 February 2010

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాన నైనాను యేమి లేని దాననైనాను

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి

రెండు లేకా పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి

కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని

నిలువున నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని
నిరుపేదగ నే నిలిచిపోతిని

No comments:

Post a Comment