12 February 2010

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన

బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్ప గలవా

నిన్ను మించిన కన్నెలెందరొ మండుటెండలొ మాడిపొతె
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకొ ఈ నిజా నిజాలు

చలువరాతి మేడ లోనా కులుకుతావే కుర్రదాన
చలువరాతి మేడ లోనా కులుకుతావే కుర్రదాన
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనొ చెప్ప గలవా
కడుపు కాలే కష్ట జీవులు ఒడలు విరిచీ గనులు థొలిచీ
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకొ ఈ నిజా నిజాలు

గాలి లోనా తేలిపొయే చీర గట్టిన చిన్న దాన
గాలి లోనా తేలిపొయే చీర గట్టిన చిన్న దాన
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవ
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళె నేసినారు

చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో.

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకొ ఈ నిజా నిజాలు

No comments:

Post a Comment