13 February 2010

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా (2)

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా



దోరవయసు అలవి కాని భారమయింది

ఆ బరువు మోయలేక నడుము పలచబడింది (2)

నడుములేని నడకే ఒక నాట్యమయింది (2)

చూచి చూచి బావ మనసు సొంమసిల్లింది.. సొంమసిల్లింది (మిడిసి)



అత్తకూతురంటేనే హక్కు ఉందిలే

అల్లరెంత చేసినా చెల్లుతుందిలేమ్ (2)

ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో (2)

ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే (మిడిసి)

No comments:

Post a Comment