జయ జయ మహాదేవ శంభో సదాశివా
ఆశ్రితమందారా శ్రుతిశిఖర సంచారా
నీలకంథరా దేవా దీనబంధవా రారా నన్నుగావరా
నీలకంథరా దేవా దీనబంధవా రారా నన్నుగావరా
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ
నీలకంథరా దేవా దీనబంధవా రారా నన్నుగావరా
అన్యదైవము గొలువా ఆ ఆ ఆ ఆ ఆ
అన్యదైవము గొలువా నిదుపాదము విడువా
అన్యదైవము గొలువా నిదుపాదము విడువా
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా
దర్శనమ్మునీరా మంగలాంగా గంగాధరా
నీలకంథరా దేవా దీనబంధవా రారా నన్నుగావరా
దేహియన వరములిడు దానగునసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణా
ఏమరక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములారా
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
కన్నులనిండుగా భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులనిండుగా భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా
No comments:
Post a Comment