కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
నిజానికి ఈ పాటను పూర్తిగా వేటూరి గారు రాయలేదు. కేవలం పల్లవి మాత్రమే రాశారు. అది బాగా నచ్చి నిర్మాత తన దగ్గరే ఉంచుకున్నారు. చివరకు పాట పూర్తి చేయాల్సిన సమయానికి వేటూరి బిజీగా ఉండడం వల్ల ఆత్రేయ పూర్తి చేశారు. ఆత్రేయ గారి మీద రాసిన ఓ వ్యాసంలో స్వయంగా నిర్మాతే ఈ విషయాన్ని తెలిపారు.
ReplyDelete