13 March 2010

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

వెన్న దొంగ వైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ క్రిష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం మేగా
అజ్ఞానం రూపు మాపే క్రిష్ణ తత్వమేగా

అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రా ణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే

హే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

మత్స్యమల్లె నీటిన తేలి వెదములను కాచి
కూర్మరూప ధారివి నీవై భువుని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే
నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
క్రిష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు

ఇక నీ అవతరాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఓరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మది లోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

No comments:

Post a Comment