మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవరా అ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవరా అ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళా
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా
జడి వానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసీ చెలరేగిపొవాలీ దేహం
మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
సుధాకరా అ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
ఓ ప్రేమా ప్రేమా !
సందె వేళా స్నానం చేసి నన్ను చేరీ నా చీర కొంగుతో వళ్ళు
నువు తుడుస్తావే అదు కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేకా వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే అదు కావ్యం
నీకొసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారీ ప్రియమారా ఒడి చేర్చుకోవా నీ చెలినీ
మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవరా అ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళా
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా
No comments:
Post a Comment