14 March 2010

బలే బలే అందాలు సృష్టించావు

ఆ నందన వనముగ
ఈ లోకములో సృష్టించిన
ఓ వనమాలీ! మరచితివో
మానవజాతిని దయమాలి

బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభో మాకేల ఈయవు

బలే బలే అందాలు సృష్టించావు

మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలిసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి
మారణహోమం సాగించెను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు

బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభో మాకేల ఈయవు

బలే బలే అందాలు సృష్టించావు

ఆ ఆ ఆ ఆ
చల్లగా సాగే సెలయేటివోలే
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి

బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభో మాకేల ఈయవు

బలే బలే అందాలు సృష్టించావు

No comments:

Post a Comment