20 April 2010

నవ్వులు రువ్వే పువ్వమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ నీలా
ఉండి పోతే చాలమ్మా |నవ్వులు రువ్వే|

ఆకుల పయ్యెద లో
నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో
నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన
మొగ్గ సొగసే ఉందమ్మా |నవ్వులు రువ్వే|

ఈ తోట మొత్తము కమ్మినవి
నీ దోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవి
నీ కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపుసొంపులకు
ఒడిని పడతానుండమ్మా |నవ్వులు రువ్వే|

ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో తేటి గానో
పది నాళ్ళున్నా చాలమ్మా |నవ్వులు రువ్వే|

No comments:

Post a Comment