గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే
అవకాశం అడిగెనురా అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో
అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ ||గుళ్ళో దేవుడు||
ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం ఎన్నెన్నొ ఉన్నాయి
లేని దొకటే కల్మషం ||గుళ్ళో దేవుడు||
అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న
గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఏ తిధులు లోకాలే అతిధులు ||గుళ్ళో దేవుడు||
No comments:
Post a Comment