కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ||2||
సుడిలో దూకి ఎదురీదకా ... ఆ ..ఆ ..ఆ
సుడిలో దూకి ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్||2||
||కుడి||
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ||2||
కొండలే రగిలే వడగాలీ..కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పువ్వేలోయ్..నీ సిగలో పువ్వేలోయ్
||కుడి||
చందమామ మసకేసి పోయే ముందుగా కబురేలోయ్ ||2||
లాయిరి నడి సంద్రములోనా...లాయిరీ నడి సంద్రములోనా...
లంగరుతో పని లేదోయ్..లంగరుతో పని లేదోయ్..
||కుడి||
No comments:
Post a Comment