29 May 2010

చిన్నారి చూపులకు ఓ చందమామా

చిన్నారి చూపులకు ఓ చందమామా,
ఎన్నెన్నొ అర్థాలు ఓ చందమామా, నా చందమామా! || చిన్నారి చూపులకు ||

తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తె
పిలిచినట్టే వెళ్ళి పలకరించాలంట || తలుపు ||
తప్పించుకునిపోయి జాలిగా చూస్తేను (2)
వలచినట్టే యెంచి మురిసిపోవాలంట || చిన్నారి చూపులకు ||

కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తె
తననింక విడువనని బాస చేయాలంట || కనుబొమలు ||
కొంగు సవరించుకొని కొరకొరా చూస్తేను (2)
చెంగు వీడనటంచు చెంత చేరాలంట || చిన్నారి చూపులకు ||

No comments:

Post a Comment