10 May 2010

శ్రీ రంగ రంగ నాదుని దివ్య రూపమే చూడవే

శ్రీ రంగ రంగ నాదుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగ నాయకి నామ సంతతం పాడవే
నీలవేణి లో నీటి ముత్యాలు నీర జాక్షునికి పూలుగా
కృష్ణవేణి లో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా || శ్రీ

1|| గంగను మరుపిన్చు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగిన్టి రాణి
పాపాల హరియించు పావన జలమూ
పచ్చగా ఈ నేల పండించు ఫలమూ

ఈ ఏటి నీటి పాయలే తేట గీతులే పాడగా
సిరులెన్నో పండి ఈ భువీ స్వర్గ సీమగ మారగా
కల్ల కపటమె కాన రాని ఈ పల్లె సీమలో || శ్రీ||

No comments:

Post a Comment