12 May 2010

తద్దినక తానా.. తద్దినక తానా

తద్దినక తానా.. తద్దినక తానా..||2||
తక్‌దిన దిం.. తక్‌దిన దిం.. ||2||

కాశ్మీరు లోయలో కన్యా కుమారి రో ఓ చంద మామ...ఓ చంద మామ...
కన్నె ఈడు మంచు లో కరిగే సూరీడు రో ఓ చందమామ..ఓ చంద మామ...
పొగ రాని కుంపట్లు రగిలించినాదే...
పొగరెట్టి చలిగాడ్ని తగిలేసినాడే...
చెమ్మ చెక్క చేత చిక్కా..
మంచమల్లె మారి పోయె మంచు కొండలు...
మంచి రోజు మార్చమంది మల్లెదండలూ...

||కాశ్మీరు||

తేనీటి వాగుల్లో తెడ్డేసుకొ...పూలారబోసేటి ఒడ్డందుకో..
శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడు తో ఈడు చలి కాచుకో పొద్దారి పోయాక పొద చేరుకో
గుండెలోనా పాగా గుట్టు గా వేసాకా గుత్తమైనా సోకు నీదే కదా
అరె తస్సాచెక్కా ఆకు వక్కా...ఇచ్చుకోక ముందె పుట్టె తాంబూలమూ
పెళ్ళి కాక ముందె జరిగె పేరంటమూ...

||కాశ్మీరు||

సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో...
పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో...
కాశ్మీర చిలకమ్మ కసి చూసుకో...చిలక పచ్చ రైక బిగి చూసుకో..
గూటి పడవల్లోన చాటుగా కలిసాక నీటికైనా వేడి పుట్టాలిలే...
పూత మొగ్గ లేత బుగ్గ సొట్ట పడ్డ చోట పెట్టు నీ ముద్దులు..
సొంతమైన చోట లేవు ఏ హద్దులూ...

||కాశ్మీరు||

No comments:

Post a Comment