08 May 2010

పొద్దున్నే పుట్టింది చందమామ

పల్లవి:

పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంలో పుట్టవా గీతికా హొయ్
స్నేహంలో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దురలేచి
ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో
పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం1:

బుగ్గెట్టా పట్టాలో,నలుగెట్టా పెట్టాలో
లాలెట్టా పోయెలోయమ్మ ఓ రబ్బరుబొమ్మ
లాలించేదెట్టా చెప్పమ్మ
మొగ్గంటి బుగ్గల్లో,అగ్గల్లే న్సిగ్గొస్తే
జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దులకన్నా
కౌగిట్లో జోకొట్టాలయ్య
నాకంటిపాపల్లో ఉయ్యాల వెయ్యాల ఈ కొంటె పాపాయికి
ముందుమునుపులేని ఈ పొద్దిటి వెన్నెల ఆవిరిలో
ముద్దుమురిపాలన్ని పండించేదెట్టాగఓ
ఇక ఏ పేరుపెట్టాలో ఇన్నాళ్ళు ఎరుగని ఈ కొంటె చెక్కిలిగింతల ఉక్కిరిబిక్కిర్కి
పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం2:

నీకోసం పుట్టాను,నిలువెల్లా పూచాను గుండెల్లో గూడే కట్టాను
నా బంగరుగువ్వ గుమ్మంలో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను,నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను
నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకు పోలేను
శృంగార స్నేహాల సంకెళ్ళు వేయాలా సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకుదుడుకు తగ్గించి కొంగున కట్టేసేసె కిటుకేదో చెప్పమ్మా
అది పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో,రేయేదో తెలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ,మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంలో పుట్టవా గీతికా హొయ్
స్నేహంలో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దురలేచి
ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో

No comments:

Post a Comment