మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపగ తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటినే నీ మనసు నాదనుకొంటిలే
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమ్రుత వాహిని వోలలాడి మైమరచితిలే
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుస రుసలాడుతు విసిరిన వాల్జెడ వలపు పాశమని బెదరితిలే
No comments:
Post a Comment