12 May 2010

ప్రేమలీవిధమా విషాదమే ఫలమా

ప్రేమలీవిధమా విషాదమే ఫలమా
మన్నాయెనా మా ఆశలు కన్నీరే మిగిలేనా
ప్రేమలీవిధమా విషాదమే ఫలమా
మన్నాయెనా మా ఆశలు కన్నీరే మిగిలేనా

కన్నెమది చిరువెన్నెలా పున్నమియె కరువాయెనా
తీరని మది కోరిక కొనసాగగా దరిచేరినా
తరి తీయని మన ప్రేమలా తండ్రియె దూరము చేసే

మన రాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం
మన రాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం
కోరిన ప్రియులు చేరిన వెనుక కూరిమి బేరము లాడగనేల
కోరిన ప్రియులు చేరిన వెనుక కూరిమి బేరము లాడగనేల
కన్నులు పూచే నిన్ను గనీ
మనసు దోచేసి చేసె నీ దాసుని
కొనవోయి వెలవోసితి నామది
తీయని కోరికలు తీరును రావె
మన రాగమేగా అనురాగం
తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం
మన రాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం

No comments:

Post a Comment