చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ||2||
వున్నదంతా చీకటైతే వుందీ నీవేనే ||2||
మిగిలిందీ నీవేనే
||చెలియ||
చెలిమి పోయే చెలువు పోయె నెలవే వేరాయే ||2||
చేరదీసి సేవ చేసే తీరూ కరువాయె ||2||
నీ దారే వేరాయే
||చెలిమి||
మరపు రాని బాధ కన్నా మధురమే లేదు ||2||
గతము తలచీ వగచే కన్నా సౌఖ్యమే లేదూ ||2||
అందరాని పొందు కన్నా అందమే లేదు అనందమే లేదు
||చెలియ||
వరద పాలౌ చెరువులైనా పొరలి పారేనే ||2||
రగిలి పొగలౌ గుండెలైనా పగిలి జారేనే ||2||
దారి లేని బాధ తో నేనారి పోయేనా
కధ తీరీ పోయేనా...
||చెలిమి||
వున్నదంతా చీకటైతే వుందీ నీవేనే
మిగిలిందీ నీవేనే
No comments:
Post a Comment