చిగురుల పూవుల సింగారముతో ---- ---- గనలేదు
ముసిముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువు రానేలేదు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో || కాలం కాని ||
వలుపులు మీటగ తీయని పాటలు హృదయవీణపై పలికెనుగా,
ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా!
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే || కాలం కాని ||
తళుకుబెళుకుళ తారామణులతో శారదరాత్రులు రాలేదు,
ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడు రానేలేదు!
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల యెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో || కాలం కాని ||
తలచిన తలపులు ఫలించగలవని బులబాటము బలమాయెనుగా,
పగటి కల గను కన్యామణులను ప్రియుడే రాకాచంద్రుడుగా!
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే || కాలం కాని ||
No comments:
Post a Comment