10 May 2010

యెవ్వరి కోసం ఈ మందహాసం

యెవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
యేమని వివరింతును
గడుసరి యేమని వివరింతును

ఆ వలపులు చిలికె వగలాది చూపు
పిలువక పిలిచీ విరహాల రేపు
ఎదలో మెదిలె చెలికాని రూపు
ఏవొ తెలియని భావల రేపు
ఈ నయగరం ప్రేమ సరాగం
ఈ నయగరం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబారాలే

ఆ పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసి మరపించు మనసు
ప్రణయము చిందె సరసాల గంధం
ఇరువురి నొకట్టిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో

No comments:

Post a Comment