సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె||
ఎలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోట పలికింది నాలో
పలికించుకోవె మది కొయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వన దేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే ||సిరిమల్లె||
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకొవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే ||ఎన్నెల్లు తేవే||
అహహా... లలలాల లాల...
No comments:
Post a Comment