12 May 2010

స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా

స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా
స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా
కడదాక నీడ లాగ నిను వీడి పోదు రా
ఈ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేను రా...

||స్నేహానికన్న||

తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరి రావన్నా..ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరి కారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహమే నీ ఆస్తి రా... నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా...

||స్నేహానికన్న||

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం..ఓ..
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ధ్రువతార లా స్థిరమైనదీ.. ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమొకటేను రా...

||స్నేహానికన్న||

No comments:

Post a Comment