ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..!
పొంగే అలవొస్తే తలవంచాలి
వయసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడి రాగా ||ఏదిక్కున||
చరణం 1
గిరులే వణికే జలపాతంలో జోరు
నీలో చూశా బంగారూ
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు
అలలై ఎగసే ఎదహోరు
వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి
వయ్యారి ఒంటికి పూసిందెవరు..?
చరణం 2
మధువే తొణికే అధరం మధుకలసం
మౌనం కూడా ప్రియమంత్రం
అపుడూ అపుడూ తెగి పడనీ ఒక ముత్యం
వెనకే తిరిగా ప్రతినిత్యం
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి
నాలోని తలపులే స్వరాలు చేసి
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి... ||ఏదిక్కున||
No comments:
Post a Comment