12 May 2010

పాప ఈడు గోలా..పాట పేరు జోలా

పాప ఈడు గోలా..పాట పేరు జోలా..
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా...
నీవు వేణువైతే..నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల..మోహాల సరి రాగాలా...
Be happy... happy all the time... ||3||


ఏదో సాగింది చిలిపి కధా..ఓటమి గెలుపైన వలపు కధా...
కునుకే రాకున్న కనుల కధా..ఉడికే పరువాల పడుచు కధా..
పూసేటి వేసంగి పూరేకులో...రాస్తాను నీ పేరు తేనెలతో...
తెన్నేటి ఇసుకమ్మ తీరాలలో...వేస్తాను పాదాలు నీ జతలో...
పాషాణమై పోకు వైఢూర్యమా....

పాప ఈడు గోలా..పాట పేరు జోలా..
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా...

ఆటే కారాదు బ్రతుకు సుమా...అతికే మనసంటు లేదు సుమా..
చేతులు కలిపింది చెలిమి సుమా...ఎగిరే నా ప్రేమ పావురమా..
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో..ఈనాడు వేచేను దోసిలి తో...
కాలాలు దాటాను కౌగిళ్ళలో...స్వర్గాలు చూడాలి నీ ఒడిలో..
శిల నీవు కాబోకు శృంగారమా...

పాప ఈడు గోలా..పాట పేరు జోలా..
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా...
నీవు వేణువైతే..నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల..మోహాల సరి రాగాలా...
Be happy... happy all the time... ||3||

No comments:

Post a Comment