03 June 2010

అడుగడుగు గుండెనడుగు......తడబడిన ఈడునడుగు

||పల్లవి||
అడుగడుగు గుండెనడుగు......తడబడిన ఈడునడుగు....
ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే
నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే.......
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులొ పాకాయిలే
ఊహకు రాని తహ తహలేవో తాపం పెంచాయిలే
నా నరనరం జివ్వంది........తనువుతో అనుభవం అడిగింది

||చరణం 1||
కోరికేదో తొలిమొటిమై పూసె, తేనెలాగ చిరు చెమటైపోతె
మాయ......ఇది ఎవరి మాయ.....
సిగ్గు నూనూగు చిగురే వేసె, ఉగ్గపట్టి ప్రాణాలే తీసె
మంత్రం......చెలివేసే మంత్రం
చూపుదిగితే చెప్పలేని వయసు కోతా.....
వెన్నులోన చలుపుతున్న తీపి బాధా.....
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులొ పాకాయిలే
ఊహకు రాని తహ తహలేవో తాపం పెంచాయిలే
నా నరనరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది

||చరణం 2||
గోరువెచ్చని ఊపిరికే వేలికొసల చిరు తాకిడికే
మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది....
చెలియ తుంటరి నవ్వులకే తలుపు తియ్యని కౌగిలికే
వయసు భగ్గున మండింది తియ్య తియ్యగా కాల్చింది.....
చిగురాకులాగ నా ఒళ్ళే సెగ చిమ్మి పొంగుతూ ఉంది
తమకాన్ని రేపే నీ పెదవి నవనాడులాపుతూ ఉంది
నా నరనరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది

No comments:

Post a Comment