22 June 2010

వంశీ కృష్ణా!యదు వంశీ కృష్ణా!

వంశీ కృష్ణా!యదు వంశీ కృష్ణా!
వంశీ కృష్ణా!యదు వంశీ కృష్ణా!
గోప వనితా! హృదయ సరసీ రాజహంసా!
కృష్ణా..కృష్ణా!
గోప వనితా! హృదయ సరసీ రాజహంసా!
కృష్ణా..కృష్ణా!

పుట్టింది రాజకుమారుడుగా..
పెరిగింది గోపకిశోరుడుగా..
తిరిగింది యమునా తీరమున
నిలిచింది గీతసారంలో
గోప వనితా! హృదయ సరసీ రాజహంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా!యదు వంశీ కృష్ణా!


ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేదీ పాడించేది,ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నీవేలే అన్నీ నీ లీలలే
గోప వనితా! హృదయ సరసీ రాజహంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా!యదు వంశీ కృష్ణా!

నోటిలో ధరణి చూపిన కృష్ణా!
గోటితో గిరిని మోసిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
కిల కిల మువ్వల కేళి కృష్ణా!
తకథిమి తకథిమి తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా!తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా!తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా!తాండవ కృష్ణా!

No comments:

Post a Comment