వందే మాతరం...వందే మాతరం...||2||
వందే మాతర గీతం వరస మారుతున్నది..||2||
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ||2||
సుజల విమల కీర్తనలో..సుఫలాశయ వర్తన లో...||2||
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది...
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా..
కంటి కంటి లో తెలియని మంట రగులుతున్నది...
మంట రగులుతున్నది...
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ||2||
||వందే||
సశ్యామల విభవస్తవ గీతాలాపన లో...||2||
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి...
సుప్రజ్యోస్త్నా పులకిత సురుచిర యామినులలోనా...
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది...
గిరాకి పెరుగుతున్నది...
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ||2||
||వందే||
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..||2||
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది...
సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమి...
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది...
ప్రజా సుఖమె తమ సుఖమని వరదానాలిస్తున్నా...
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది... ||2||
అక్కడనే వున్నది....
||వందే||
No comments:
Post a Comment