నీలి మేఘాలు..
నీలి మేఘాలు ఆకాశవీధిలో ఆడుకునే మెరుపు కన్నె నీలిమ అనే అమ్మయి నేలకు వచ్చేసిందని ఆమెని అన్వేషిస్తూ వచ్చిన దివి దూతలు..
నీలి మేఘాలు..
ఉరుముతున్న గొంతునెత్తి దిగంతాన్ని పిలుస్తూ ఆమె కొరకు బహుమతిగా హరివిల్లును చూపిస్తూ నీలిమా నీలిమ అని కలవరించే నీలాంబరి రాగాలు..
నీలిమేఘాలు
నీలిమేఘాలు చల్లని స్నేహపు జల్లుల చిరుగాలుల చేతుతో ఆమె మేని వయ్యరాల సీమన౦తా స్పర్శిస్తూ చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగాలు
టట్టటారా టట్టటారరా టారట్టటారా
ఆకాశంలో నీలి మబ్బులై ఊరేగే ఊహలు
అమ్మను వదిలి ఆకతాయినై పరిగెత్తే పాపలు
అవి చిరుజల్లుల్లో చిట్టి చినుకులై తిరిగొచ్చే వేళ
అని చిగురిస్తుంది పులకరింతలై నా గుండెల నేలా
కుదురుగ ఉంటే మంచు బొమ్మలా ఊగిపోద హృదయం
కులికిందంటే వనమయూరిలా ఆగిపోద కాలం
టట్టటారా టట్టటారరా టారట్టటారా
కల్లోకొచ్చి కోటి తారలు కవ్విస్తాయెందుకు
తళ తళ లన్ని కోతి కొమ్మలా ఊరిస్తాయెందుకు
నే చిటికలు కొడితే తారలు మొత్తం తలవంచుకు రావా
నా పెరటి తోటలో మంచు బొట్లుగా కల నిజమే కాదా
గాలికి ఊగే జాజితీగలా నాజూకు జాణా
గగనాన్నైనా నేలకు దించే ఈ శ్రావణవీణా
టట్టటారా టట్టటారరా టారట్టటారా
ఎల్లలు లేని గాలిపటంలా ఎగిరేటి కోర్కెలు
జాబిలితోనే ఊసులాడుతూ రాసుకున్న లేఖలు
అవి దారం తెగితే తీరం లేని ఆవార ఆశలు
ఆ దారం ఉంటే అష్టదిక్కులు పాలించే రాణులు
లావణ్యాన్నే చూపగలిగిన అంతటి రవివర్మ
ఆంతర్యంలో అంతుదొరకని సొగసు చూపతరమా
No comments:
Post a Comment