పల్లవి:
ఆమె:
లల్లలై లైలా మజ్ఞు మనమే అంటూ ఫీలైపోదాం
లల్లలై "ఎల్ ఓ వీ ఈ" మీనింగ్ ఏంటో కనిపెడదాం
అతను:
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేను నేనే నువ్వై కనపడదాం
ఆ:
మనం ఒకటైతే సరిపోదే మన నీడలనేం చేద్దాం
అ:
వాటినీ పక్కన నిలిపి ఒకటిగ కలిపీ ప్రేమని పేరెడదాం
చరణం:
అ:
నీ ఒంటి మీద చోటు చూసుకుంటా
చిన్న పుట్టమచ్చలాగ అంటుకుంటా
రోజుకొక్క మాటు నువ్వు నన్ను తానాల వేళలోన ముట్టుకుంటె చాలునంటా
ఆ:
పచ్చబొట్టులాగ నేను మారిపోతా
వెచ్చనైన ఛాతిపైన వాలిపోతా
లాలి పాడుకున్న లాయిలాయి లల్లాయి హాయిలోన చందానాలు జల్లుకుంటా
అ:
నీ నడుమొంపు మెలికై ఉంటా
నీ జడపాయ నలుపై పోతా
నీలో లాగు తళుకై ఉంటా
నీ చేతికున్న గాజునై గలగలమంటా
ఆ:
హ్మ్మ్ కొంటె దిగులంతా పలికిందా నీ వయసున గిలిగింతా
అ:
తీగలాగిందే నీవని తొణికిందేమొ పెంచిన ప్రేమంతా
చరణం:
అ:
నువ్వు పిల్లిమొగ్గలెయ్యమంటె రెడీ
ఎత్తుకొండలెక్కి దూకమంటె రెడీ
కన్నె కంటి సైగ చెప్పినట్టు తూచాలు తప్పకుండ చేసుకుంట ప్రేమ సందడి
ఆ:
నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటె రెడీ
తేనె విందులోకి దించుకుంటె రెడీ
నిన్ను రాసుకుంటు పూసుకుంటు రాగాలు తీసుకుంటు పాడుకుంట ప్రేమ మెలొడీ
అ:
నువ్వేదంటె అవునని అంటా
నీ పెదవంచు నవ్వై ఉంటా
నీ అరచేత పువ్వై ఉంటా
నా తూరుపెక్కడున్నదంటె నిన్ను చూపిస్తా
ఆ:
పట్టు తెర తీస్త ఎదురొస్తా నువు కోరిన అలుసిస్తా
అ:
అందుకే రేయీ పవలు రెప్పలు కాస్తూ నీకోసం చూస్తా
No comments:
Post a Comment