24 June 2010

మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్య

మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించి నావయ్య
జన్మ జన్మ పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్యా
మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించి నావయ్య
జన్మ జన్మ పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి నామయ్య
మేము తరియించినామయ్యా

పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిసుద్దుడవుతాడని
గొలీల అటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఏన్నైనా పూలన్ని ఒకటంటివీ
నిన్ను పూజించ తగునంటివీ
మా దయలేని హృదయాల దయతోటి తడిపి
తలుపుల్ని తీసేస్తివి మాలో కలతలని మాపేస్తివె

మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించి నావయ్య
జన్మ జన్మ పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి నామయ్య
మేము తరియించినామయ్యా

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధులని మాపి మరు జన్మ ఇచ్చావయ్య
వారి బాధలని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమయే ధన్యులమైనామయ్య
మాకు దైవమై వెలసావయ్యా

మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించి నావయ్య
జన్మ జన్మ పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి నామయ్య
మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా

No comments:

Post a Comment