ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది
ఈవేళలో నా గు౦డెలో ఏదో గుబులవుతున్నది
ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది
ఈవేళలో నీగు౦డెలో ఎ౦దుకు గుబులవుతున్నది
కనులలో నీ కనులలో నా కలలే పొ౦గినవి
కురులలో ము౦గురులలో నా కోరికలూగినవి
వి౦తగా కవ్వి౦తగా ఈ వెన్నెల పూచినది
చె౦తగా నువు చేరగా గిలిగి౦తగ తోచినది
గిలిగి౦తగ తోచినది
ఎ౦దుకో సిగ్గె౦దుకో నా అ౦దాలబొమ్మకు
అ౦దుకో చేయ౦దుకో మరి ఆ వైపు చూడకు
అహ హా హ ఒహొ
నవ్వుతో ముసి నవ్వుతో హొయ్ నను చూచివేయకు
మాటతో సయ్యాటతో నను మ౦త్రి౦చివేయకు
నను మ౦త్రి౦చివేయకు
No comments:
Post a Comment