11 June 2010

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో (2)
తెలిసీ తెలియని అభిమానవునో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది..
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఎల్లలు ఏవి వల్లనన్నది
నీది నాదొక లోకమన్నది..
నీది నాదొక లోకమన్నది..
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

తొలిచూపే నను నిలదీసినది
మరుమాటై అది కలవరించినది
మొదటి కలయికే ముడి వేసినది
తుదిదాకా ఇది నిలకడైనది..
తుదిదాకా ఇది నిలకడైనది..
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

No comments:

Post a Comment