01 June 2010

తెల్లవారే వేళా నింగి రంగుల్లో..

తెల్లవారే వేళా నింగి రంగుల్లో..
మేలుకొమ్మని పాడే సందె రాగం లో..
ఒళ్ళు విరుచుకుని లేచే నిన్న రాత్రి కలలు..
కళ్ళు తెరుచుకుని చూసే కొత్త ఆశ విరులూ..
పదమే పథమై త్వరగా పదరా..
ఎవరో ఒకరూ వహ్వా అనరా.. హే...

||తెల్లవారే వేళ||

సూర్యోదయానికి సుస్వాగతం..పాడింది గువ్వల సంగీతం..
తొలిపొద్దు కాంతికి అభివందనం..అంటోంది పువ్వుల సౌందర్యం
శ్వాసలో సుప్రభాతం చూపులో కొత్త లోకం..
గుండెలో ప్రాణనాదం. గొంతులో కూని రాగం..
చిలకలై పలుకుతూ వేకువైన ఈ వేళలో..
పరిమళం చిలుకుతూ తాకుతున్న ఈ గాలితో..
పదమే పథమై త్వరగా పదరా..
ఎవరో ఒకరూ వహ్వా అనరా.. హే...

||తెల్లవారే వేళ||

ఏ రాతిరి తన చెఱశాల లో ఉదయాన్ని ఆపదు కలకాలం..
ఏ చీకటీ తన తెర చాటులో.. స్వప్నాన్ని దాచదు ఏ మాత్రం..
రమ్మనే రేపుకోసం కమ్మగా కలలు కందాం
నమ్మకం తోడు ఉంటే నింగినే అందుకుంటాం..
అందెరా సోదరా మూగపోని ఎద సందడి
ముందరే ఉంది రా కోరుకున్న ఆ సంగతీ..
పదమే పథమై త్వరగా పదరా..
ఎవరో ఒకరూ వహ్వా అనరా.. హే...

||తెల్లవారే వేళ||

No comments:

Post a Comment